స్మార్ట్ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనా ప్రముఖ మొబైల్ సంస్థ వివో వై సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. 24 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా వై79 స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ స్మార్ట్ఫోన్ను మూడు రంగుల్లో డిజైన్ చేశారు. షాంపైన్, మాట్ట్ బ్లాక్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ ఉంటుంది. ప్రత్యేక ఫీచర్లు.. 5.99 అంగుళాల 18:9 డిస్ప్లే, ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీ, 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ్ బ్యాటరీ సామర్థ్యం 3225 ఎంఏహెచ్