నేటి యువత అభిరుచులకు అనుగుణంగా సెల్ఫీ ఎక్స్ఫర్ట్్ స్మార్ట్ఫోన్లను రూపొందించటంలో నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలిచింది ఒప్పో. ఈ మొబైల్ ఉత్పత్తి చేసిన మరో స్మార్ట్‌ఫోన్ ఇటీవల మార్కెట్లోకి విడుదలైంది. ఒప్పో ఎఫ్5 లాంచ్‌తో స్మార్ట్‌ఫోన్ కెమెరాలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తీసుకువచ్చిన మొట్టమొదటి బ్రాండ్‌గా ఒప్పో చరిత్ర స ష్టించింది. అనేక సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ విప్లవాత్మక ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ లేటెస్ట్ సెల్ఫీ సెంట్రిక్ ఫోన్ ద్వారా ఫ్రంట్ కెమెరాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందు బాటులో ఉంటుంది. సెల్ఫీలంటే ఎక్కువ మక్కువ చూపించేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్ నిలిచిన బ్యూటీ టెక్నాలజీ సహజసిద్ధమైన అందంతో సెల్ఫీలను అందిస్తుంది..
ఒప్పో ఎఫ్5లో 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బిల్ట్-ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో ఈ టెక్నాలజీ ఏకంగా 200 ఫేషియల్ రికగ్నిషన్ స్పాట్లను రికార్డ్ చేసి ఫైనల్ అవుట్ పుట్‌ను బెస్ట్ క్వాలిటీతో అందిస్తుంది.
ఒప్పో ఎఫ్5 ఫ్రంట్ కెమెరా ఇమేజ్‌లోని సబ్జెక్ట్ స్కిన్ టోన్, కలర్, వయసులను గుర్తించి అందుకు అనుగుణంగా సెల్ఫీలను తీస్తుంది.
ఈ ఫోన్‌తో క్యాప్చుర్ చేసే ప్రతి రియల్ ఇమేజ్‌కు కస్టమైజిడ్ బ్యూటీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాంటి వాతావరణంలో ఉన్నా.. ఫోటోలో మాత్రం న్యాచురల్ లుక్ వస్తుంది. ముఖం పై మచ్చలనేవి కనిపించవు.
ఇతర ఫీచర్లు...
6 అంగుళాల 2160ఐ1080 పిక్సెళ్ల రిజల్యూషన్ ఉన్న స్క్రీన్‌తో, మీడియాటెక్ ఎంటీ6763టీ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో మెయిల్ జీ71 గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్‌కు ముందు 20 మెగా పిక్సల్ కెమెరా, వెనుక 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది.
ఈ ఫోన్లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీ వయసు, జెండర్, స్కిన్ టైప్, స్కిన్ టోన్ వంటి వివరాలను విశ్లేషించి మెరుగైన బ్యూటీ ఎఫెక్ట్‌తో కూడిన సెల్ఫీలను తీస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తోంది. 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబీ ర్యామ్‌తో ఒక మోడల్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్‌తో మరో మోడల్ అందుబాటులోకి వస్తాయి.
Authorization