డిజిటల్ యుగంలో ప్రతిదీ కంప్యూటర్‌తోనే అనుసంధానం అవుతున్నది. విద్యా, వైద్య, వ్యాపార, సేవ .. ఇలా ఏ రంగాన్ని చూసినా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కనిపిస్తుంది. కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు.. చిల్లర సరుకులు అమ్మే దుకాణంలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. చిన్నచిన్న ఉద్యోగాలకు సైతం ఐటీ స్కిల్స్ తప్పనిసరి అవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం కావాలంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది తప్పనిసరిగా మారింది. ఉచితంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకునే అవకాశాలున్నాయి. సులభంగా ప్రోగ్రామింగ్ నేర్పించే సైట్లు ఎన్నో ఉన్నాయి.. వాటి గురించి..
ఏరంగంలో రాణించాలన్నా.. కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఐటీ స్కిల్స్ నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ సాధించాలంటే ఎన్నో ప్రోగ్రామింగ్ కోర్సులు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గల్లీలో ఇనిస్టిట్యూట్ పనిచేస్తుంది. అయితే అక్కడ ఫీజులు వేలల్లో ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నవారిలో చాలామంది మంచి పేరున్న ఇనిస్టిట్యూట్‌లో చేరి ట్రైనింగ్ పొందుతారు. ఐటీ నిపుణుల గెడైన్స్ తీసుకుంటారు. వేలాదిరూపాయల ఫీజులు కట్టే పరిస్థితిలేని వారు ఐటీ స్కిల్స్ నేర్చుకోవాలనుకునేవారికి ఆన్లైన్లో బెస్ట్ ప్రోగ్రామింగ్ వెబ్‌సైట్స్ ఎన్నో ఉన్నాయి. ఇంగ్లీష్ కొద్దిగా వస్తే చాలు రోజుకు గంట సమ యం కేటాయించి ఆన్లైన్లో ప్రోగ్రామింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు.
Treehouse
ప్రోగ్రామింగ్ తో పాటు వెబ్సైట్ , వెబ్అప్లికేషన్లను అభివ ద్ధి చేసేవారికి మంచి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన కోర్సులు నేర్చుకోవాలంటే మాత్రం ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. మరి ఉచితంగా వీటిని నేర్పించే సైట్లు చాలానే ఉన్నా వాటిలో ట్రీహౌజ్ సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంది.
ఈ వెబ్ పేజీని ఓపెన్ చేస్తే మీకు కావల్సిన పూర్తి సమాచారం అందించడంతో పాటు కోర్సుల గురించిన పూర్తిస్థాయిలో అవగాహనను పెంపొందించుకోవచ్చు. ఈ సైట్ ద్వారా రోజూ కొన్ని వేలమంది ప్రోగ్రామింగ్ కోర్సుల గురించి తెలుసుకుంటారు.
W3schools
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్పిస్తోన్న ప్రముఖ వెబ్సైట్లలో W3schools.com ఒకటి. ఈ వెబ్సైట్ ఆఫర్ చేసే అన్ని ప్రోగ్రామింగ్ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ సైట్ మీరు నేర్చుకోవాలనుకుంటున్న కోర్సులను చాప్టర్లుగా మార్చి అర్థవంతంగా వివరిస్తుంది. ప్రాక్టీస్ చేసుకునేందుకు కోడింగ్ ఎడిటర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న కోర్సులు ..
HTML/CSS, JavaScript, HTML Graphics,
Server Side, XML Tutorials, WEB Building,
Codecademy
ఆన్లైన్లో కోడింగ్ నేర్చుకోవాలనుకునే వారికి Codecademyఎంతో ఉపయోపడుతుంది. ఇంట్లోనే ఉచితంగా ఆన్లైన్ కోడింగ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకునేవారి బెస్ట్ ఛాయిస్. ఈ వెబ్సైట్ మెయిన్ పేజీలోనే ప్రోగ్రామింగ్‌ను ప్రాక్టీస్ చేసుకునే సదుపాయం ఉంటుంది. కోడ్ అకాడమీ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు..
Web Fundamentals, PHP, JavaScript, jQuery,
Python, Ruby, APIs
Code Avengers
ఆన్లైన్లో కోడింగ్ నేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మరో వెబ్సైట్ జశీసవ Aఙవఅస్త్రవతీర. ఈ సైట్‌ను ప్రత్యేకించి ప్రోగ్రామింగ్ నేర్పించటానికే డిజైన్ చేసారు. సైట్ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు.. నువీూ5, జూూ3, జీaఙaూషతీఱజ్ూ, ుష్ట్రవజశీసవ ూశ్రీayవతీ నువీూ5, జూూ3, జావాస్క్రిప్ట్ వంటి కోర్సులను ఇందులో నేర్చుకోవచ్చు. ఐటీ రంగంలోని పలువురు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించబడిన కొన్ని సింపుల్ ప్రాజెక్ట్స్ ఈ వెబ్సైట్లోఅందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ప్రోగ్రామింగ్ సులువుగా నేర్చుకునే అవకాశం ఉంది.
rubykoans
ఇరత ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విదేశాలకు విద్యా, ఉద్యోగాల కోసం వెళ్ళేవారు అక్కడి భాషను సులభంగా నేర్చుకునేలా రూపొందించిన వెబ్సైట్ రూబీకోన్స్. ఇందులో దేశ, విదేశాల లోని అనేక భాషలు నేర్చుకునే సదుపాయం ఉంది. మీకు వచ్చిన, నచ్చిన భాషలోని పుస్తకాలతో కూడిన ఈ-లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ వెబ్సైట్లన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ను ఉపయోగించడం, ఇంగ్లీషులోని కమాండ్స్ చదివి అర్థం చేసుకోగల పరిజ్ఞానం ఉంటే చాలు. సులభంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. అంతేకాదు నేర్చుకునే క్రమంలో ఏవైనా సందేహాలు ఉంటే వెబ్సైట్ డెవలపర్ల్లను సంప్రదించవచ్చు. వారి సలహాలు, సూచనలు పాటిస్తూ.. మరింత త్వరగా మీరు కోరుకున్న కోర్సులను నేర్చుకోవచ్చు.
Authorization