సెల్పీ యుగంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సగటున రోజుకు నాలుగు సెల్పీలైనా తీసుకుని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు లేరంటే అతిశయోక్తి కాదు. యువత నాడీ తెలుసుకున్న స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా సెల్ఫీ కెమెరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. అదిరే సెల్ఫీలు తీసేలా అందుబాటులోకి వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ రెడ్మీ వై1. ఇందులో అమర్చిన సరికొత్త టెక్నాలజీ 'సెల్ఫీ లైట్' . . 16 మెగాపిక్సల్ సామర్థ్యంతో క్లిక్ మనిపిస్తుంది. బిల్ట్ఇన్ 'బ్యూటిఫై 3.0'తో సెల్ఫీలకు అదనపు హంగులు చేర్చవచ్చు. ఈ ఫోన్ స్క్రీన్ 5.5 అంగుళాలు ఉంటుంది. 1280ఞ720 రిజల్యూషన్‌లో పిక్సల్స్ తీసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 3080 ఎంఏహెచ్. 'మియూ' ఇంటర్నెట్ సాయంతో బ్యాటరీ బ్యాక్అప్ మరింత పెంచుకోవచ్చు. క్వాల్కమ్ శ్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 4జీబీ. ఇంటర్నల్ మెమొరీ 64జీబీ.