స్మార్ట్ఫోన్లు వచ్చాక ఫైల్ ట్రాన్స్ఫర్కి అందరూ ఉపయోగిస్తున్న ఫీచర్ 'షేర్ఇట్'. అయితే ఇటీవల దీనికి పోటీగా మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు సరికొత్త ఫీచర్లతో ఫైల్ షేరింగ్ కోసం 'షేర్ ఆప్'లను తయారుచేశాయి. ఈ ఆప్‌లు టెస్టింగ్ దశను ముగించుకొని, త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వైఫై ద్వారా ఫైల్స్‌ను షేర్ చేసుకునే సదుపాయం ఇప్పటికే యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్లో ఉంది. ఇప్పుడు గూగుల్ కూడా 'ఫైల్స్ గో' పేరుతో 'షేర్ యాప్' ను రూపొందించింది. ఇది ప్లేస్టోర్‌లో బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. ఫైల్ షేర్ చేయటమే కాదు, డూప్లికేట్ ఇమేజ్‌లను ఇది గుర్తిస్తుంది. అవసరం లేని ఆప్‌లను తొలగిస్తుంది. మైక్రోసాఫ్ట్ కూడా 'నియర్ షేర్' పేరుతో 'విండోస్ 10' వాడే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లకు కూడా పనికొచ్చేలా 'షేర్ ఆప్'ను రూపొందించింది. 'విండోస్ 10' ద్వారా యాక్సెస్ అయ్యి బ్లూటూత్ ద్వారా ఫైల్స్, ఇమేజెస్, యూఆర్ఫైల్స్ పంపొచ్చు. విండోస్ ల్యాప్‌టాప్ వాడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ లో బ్లూటూత్, యూఎస్బీ బ్లూటూత్ ఎడాప్టర్తో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.