ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ లెనొవొ తాజాగా మరో కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. 'మోటరోలా' సిరీస్కు చెందిన 'మోటో ఎక్స్4' స్మార్ట్ఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్లో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. బ్లాక్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి.మోటో ఎక్స్ 4 ఫీచర్లు..- 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, - గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, - ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్,- 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ ,4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ - డ్యూయెల్ ఆటోఫోకస్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 12 ఎంపీం8 ఎంపీ రియర్ కెమెరా,- లో-లైట్ మోడ్ ఫీచర్ ఉన్న 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, - డ్యూయెల్ సిమ్ (నానో),- ఆండ్రాయిడ్ 7.1.1 నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్, - ఐపీ 68 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్, - 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, - టర్బో పవర్ చార్జర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు