రోజురోజుకు టెక్నాలజీ రంగంలో వస్తున్న కొత్తకొత్త ఆవిష్కర ణలు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాయి. సెల్ఫోన్లో కెమెరా అందుబాటులోకి రావడం ఒక విప్లవమైతే.. ఫొటోగ్రఫీ రంగంలో వస్తున్న వినూత్న టెక్నాలజీ సరికొత్త పరికరాలు నాణ్యమైన ఫొటోలను తీయడానికి అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మార్కెటులోకి వచ్చిన ఎయిర్ రిమోట్ ఫొట్రోగ్రఫీని ప్రొఫెషనల్‌గా తీసుకునేవారికి ఎంతో ఉపయోగ పడుతుంది. ఫూజీ ఫిల్మ్ - ప్రొఫొటో సంయుక్తంగా రూపొందించిన ఈ ఎయిర్ రిమోట్ టిటిఎల్-ఎఫ్, హెచ్ఎస్ఎస్ను మార్కెట్లో విడుదల చేశారు. ప్రస్తుతం అన్ని ఫొటోస్టోర్లలో ఇది లభిస్తున్నది. ఫూజీ ఫిల్మ్ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఫొటో రంగానికి నాణ్యమైన ఫొటో పేపర్‌ను సరఫరా చేస్తున్నారు. 35 ఎంఎం ఫిల్మ్ నుంచి కలర్ ఫిల్మ్ వరకు ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ప్రస్తుతం ప్రొఫొటో సంస్థతో కలిసి పరిశోధనలు చేసి ఎయిర్ రిమోట్ టిటిఎల్-ఎఫ్, హెచ్ఎస్ఎస్ను అందుబాటు లోకి తెచ్చింది. దీనివల్ల ఫొటోలను అత్యంత కాంతివంతంగా తీయవచ్చు. ఎయిర్ టిటిఎల్-ఎఫ్‌తో మంచి ఎక్స్‌ఫోజర్ టైమ్ తీసుకొని నాణ్యమైన చిత్రాలను తీయవచ్చు.
ఇది పూర్తిగా వైర్లెస్ రేడియో రిమోట్ ట్రాన్స్‌మీటర్‌తో అటాచ్ చేసిన పరికరం. దీన్ని ఫూజీ కెమెరాలకే కాకుండా నికాన్, కెనాన్ కెమెరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ రిమోట్ టిటిఎల్-ఎఫ్ , హెచ్ఎస్ఎస్ పూర్తిగా బి1 ఎక్స్, బి1, బి2, డి2, పది ప్రోలైట్స్కు ఈ రిమోట్ ఉపయోగపడుతుంది. నాణ్యమైన చిత్రాలను బెటర్ టైమింగ్‌తో తీసేవీలు కలుగుతుంది.
Authorization