వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని ఆడియో ద్వారానే కాకుండా వీడియో ద్వారా చేరువచేసే సూపర్టెక్నాలజీ యుగంలో ఉన్నాం. వాయిస్‌తో కనెక్ట్ అయ్యే ఫీచర్లతో పనిచేసే స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీలో రోజురోజుకు చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో వస్తున్న అనేక వినూత్నమైన ఫీచర్లు అబ్బురానికి గురిచేస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని నూతన ఆవిష్కరణలు స్మార్ట్రంగంలో చోటుచేసుకోనున్నాయి. వాటిలో అతి ముఖ్యమైన టెక్నాలజీ 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ'. దీని ద్వారా మనలా ఆలోచించే స్థాయిలో స్మార్ట్ఫోన్లు పనిచేస్తుంటాయి. మరో మనిషి మాదిరిగా ఇవి మన వెన్నంటి ఉంటాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీపై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే కొన్ని స్మార్ట్ఫోన్లు 'ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ' ప్రధానంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఎఐ టెక్నాలజీ అందుబాటులో ఉన్నవాటిలో కొన్నింటి పరిచయం..
ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ఫోన్లలో నాణ్యమైన ఫీచర్స్ వినియోగదా రులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటిలో కెమెరా, వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఆఫ్షన్లను ప్రధానంగా చెప్పవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లకే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఎఐ) టెక్నాలజీని చేర్చితే ఇక మన కన్నా స్పీడ్‌గా మన చేతిలోని స్మార్ట్‌ఫోన్ పని చేస్తుంది. ఉదాహరణకు ఒక ఫొటోను తీయాలనుకున్న ప్పుడు ఎదురుగా ఉన్న సబ్జెక్ట్‌ను మాత్రమే స్మార్ట్‌ఫోన్ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. అయితే ఎఐ టెక్నాలజీ అందు బాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఎదురుగా ఉన్న సబ్జెక్ట్‌తో పాటు లాండ్స్కేప్, ఫుడ్, ఫైర్‌వర్క్ ఇలా ప్రతి వస్తువును వాటికి తగినట్లుగా ఫొటో తీయడంలో ఉపయోగ పడుతుంది.
ఒక భాష నుంచి మరో భాషకు టెక్ట్స్ ను మార్చాలంటే కొద్దిగా కష్ట మైన పనే. అయితే ఎఐ టెక్నాలజీతో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఇకపై చాలా సులభం. రియల్‌టైమ్‌లో డిఫరెంట్ లాంగ్వేజ్ లను అనువదించ డానికి ఉపయోగపడుతుంది. ఫోన్‌కు మరింత సెక్యూరిటీ ఇవ్వడంలో ఇది మెరుగ్గా పనిచేస్తుంది.
యాపిల్ ఐఫోన్ ఎక్స్
యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఫోన్లో న్యూరల్ ఇంజన్‌తో పాటు ఎ11 బయోనిక్ చిప్సెట్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనిలో మెషీన్ లెర్నింగ్ ఏఐ ప్రాసెసింగ్ చాలా సులభం. ఈ ఫోన్లో అందుబాటులో ఉన్న ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఫేస్ డీ) న్యూరల్ ఇంజన్ వల్ల పని చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు చేయడంతో అదనపు సెక్యూరిటీ కల్పించి..వినియోగదారులను బాగా ఆకర్షిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 2
ఇటీవలే గూగుల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్2 ఎక్స్ఎల్ ఫోన్లకు కూడా ఏఐ టెక్నాలజీని అనుసంధానిం చారు. విజువల్ కోర్ ప్రాసెసర్ వల్ల సూపర్ ఇమేజింగ్ సామర్థ్యం దీని సొంతం. వాయిస్ కమాండ్స్ ద్వారా పనిచేసే గూగుల్ అసిస్టెంట్ ఇందులో అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్8
అనేక పరిశోధన అనంతరం అందుబాటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీతో రూపొందించిన ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్, నోట్ 8 మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉన్న బిక్స్ బే టెక్నాలజీ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. కంపాటిబుల్ ఆప్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. డివైజ్ వేగాన్ని పెంచుకోడానికి కూడా ఉపయోగపడుతుంది.
హానర్ వ్యూ 10 : కిరిన్ 970 ప్రాసెసర్‌తో వచ్చిన ఫోన్ హానర్ వ్యూ 10. దీనిలో న్యూట్రల్ నెట్వర్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఉపయోగించారు. సెక్యూర్ ఫేస్ అన్‌లాక్, కెమెరా బెనిఫిట్స్, ట్రాన్స్‌లేషన్స్, ఎన్‌హేన్సడ్ ఆటోమెషన్, వాయిస్ అసిస్టెంట్ లాంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.
Authorization