షియోమీ యెల్లైట్ నుంచి సరికొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. స్మార్ట్ హౌం ప్రొడక్ట్ తయారీ దారు అయిన యెల్లైట్ వాయిస్ అసిస్టెంట్ ఆధారిత స్మార్ట్ స్పీకర్ను మార్కెట్లోకి విడుదల చేసింది.
యెల్లైట్ అసిస్టెంట్లోని ముఖ్యమైన ఫీచర్లు గమనిస్తే.... ఈ స్మార్ట్ స్పీకర్ పైభాగంలో నాలుగు బటన్స్ ఇచ్చారు. యాక్షన్ బటన్, మైక్రో బటన్ ఆఫ్ఆన్, వాల్యూమ్ అప్ బటన్. వాల్యూమ్ డౌన్ బటన్, ఎకో డాట్ మాదిరిగా ఉంటుంది. స్పీకర్ను మ్యూట్ చేయడానికి యెల్లైట్ స్పీకర్ మధ్యలో మరోక బటన్ ఉంది.
ఈ డివైస్ అడ్వాన్స్ వాయిస్-వేక్ ఆల్గోరిథంలో సెట్ చేశారు. ఇది 5మీటర్ల పరిధిలో ఉన్న డివైజ్ టర్న్ చేయగలదు. బీమఫార్మింగ్ టెక్నాలజీతో వాయిస్ కంట్రోలింగ్ ఉంటుంది.
స్మార్ట్ స్పీకర్ 64బిట్ కార్టెక్స్ A53క్వాడ్ కోర్ ప్రొసెసర్ ద్వారా రన్ అవుతోంది. 1.2గిగా వద్ద క్లాక్, 256ఎంబి ర్యామ్, 256ఎంబి ఫ్లాష్ స్టోరేజితో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ డివైస్ 2.4గిగా 5గిగా డ్యూయల్ బాండ్ , వై-ఫై, బ్లూటూత్ తో అందుబాటులోకి వస్తుంది.
యెల్లైట్ వాయిస్ అసిస్టెంట్ డ్యుయల్ A× సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇంట్లోని స్మార్ట్ బల్బులు, టేబుల్ లాంప్స్, బెడ్ లైట్స్, సీలింగ్ లైట్స్ వంటి ఇతర ప్రొడక్ట్స్ ను నియంత్రించేలా ఈ డిజైవ్ను రూపొందించారు.
ఈ స్మార్ట్ స్పీకర్ ధరను ప్రస్తుతం 1,950గా నిర్ణ యించినా అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు.
Authorization