సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యా ర్థులు ఇలా ఏ వర్గం వారిని పరిశీలించిన డెస్కటాప్ కన్నా ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా ఉపయోగిస్తు న్నారు. తరచు ప్రయాణలు చేసేవారికి ల్యాపీతో పనిచేయడమే ఎంతో హ్యాపీగా ఉంటుంది. వీరి కోసమే టెక్నాలజీ దిగ్గజం ఏసెర్ సరికొత్త ల్యాపీని మార్కెటులోకి విడుద ల చేసింది. 9.98 మి.మి మందంతో ఉండేఈ ల్యాపీని 'స్విఫ్ట్ 7' పేరుతో నేటి తరం వినియోగ దారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ తక్కువ బరువు ఉండటంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. అతి తక్కువ లైట్ ఉన్నప్పుడు బ్యాక్ లిట్ కీబోర్డుతో పనిచేసుకునే ప్రత్యేక అవకాశం ఇందులో ఉంది. మార్చిలో అమ్మకాలు ప్రారంభమ వుతాయి. ఏప్రిల్ నుంచి ఇతర దేశాల్లో 1,29, 329 రూపాయలతో మార్కెటులో అందు బాటులో ఉంటుంది.
స్విఫ్ట్ 7 ప్రత్యేక ఫీచర్లు
ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్
అల్యూమినియం బాడీ డిజైన్
గొరిల్లా గ్లాస్
ఎన్బీటీ టచ్ స్క్రీన్ అండ్ టచ్ ప్యాడ్
256 స్టోరేజ్ కెపాసిటీ
8 జీబీ ర్యామ్
ఫింగర్ ప్రింట్ సెన్సార్
విండోస్ 10
సింగిల్ చార్జ్‌తో 10గంటల బ్యాటరీ లైఫ్
Authorization