కొత్తసంవత్సరం రాగానే ఎన్నో ఆఫర్లు.. వెరైటీ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెటులో లేటెస్ట్ ఫోన్లు.. డే టు డే లైఫ్‌తో ముడిపడిపోయిన స్మార్ట్ టెక్నాలజీకి సరికొత్త ట్రెండ్‌ను జతచేస్తూ.. న్యూలుక్‌తో వస్తున్న గ్జాడెట్స్ మార్కెటులో సందడి చేస్తున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు టెక్నాలజీతో మమేకమవుతోన్న పరిస్థితులను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంట్లో పాతఫోన్ల సంఖ్య పెరిగిపోతుంది అన్న మాట తరచు వింటుంటాం. మరి.. ఓల్డ్ స్మార్ట్‌ఫోన్‌కు సరికొత్త టెక్నాలజీని అనుసంధానం చేసి న్యూలుక్‌తో వాడే విధానం తెలుసుకుంటే.. స్మార్ట్ ఎప్పుడూ స్మార్టే అని అంగీకరించాల్సిందే..!
ఫోన్ ఉపయోగం బాగా పెరిగిపోవడంతో ఎక్కువ స్టోరెజ్, న్యూ టెక్నాలజీతో వచ్చే వాటికోసం నేటితరం ఎదురుచూస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే రోజూ మొబైల్ మార్కెట్లో ఎన్నో కొత్త వెరైటీలు ఒకదానికి మించి మరొకటి అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త ఫోన్ మార్కెటులోకి రాగానే పాత ఫోన్ మూలకు పడేస్తున్నారు.
నెట్వర్క్ అందించేలా..
మార్కెటులో నెట్వర్క్ కంపెనీలు పోటీలు పడి చౌవకగా ఇంటర్నెట్ సదుపాయాలు, చాలా తక్కువ ధరకే మంచి ప్యాకేజీలు అందిస్తున్నాయి. దీనితో కేబుల్ ద్వారా నెట్వర్క్ సౌకర్యా లను అందించే సంస్థల కన్నా.. తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటా అందించే కంపెనీలు చాలా ఉన్నాయి. వీటిని రూటర్ లేకుండానే ఇంట్లో ఉన్న అన్నీ డివైజ్‌లకు ఉపయోగిం చవచ్చు. ఇందుకోసం పాత స్మార్ట్‌ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా మంచి ప్యాకెజీతో ఉన్న సిమ్ తీసుకోండి. మీ పాతస్మార్ట్ఫోన్ను వై-ఫై రూటర్‌లా మార్చే యండి. ఇందుకోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఇన్స్టాల్ చేస్తే చాలు. వై-ఫై రూటర్‌లా మార్చుకోవచ్చు.
భద్రత వ్యవస్థను..
న్యూక్లియర్ ఫ్యామిలీల సంఖ్య పెరిగిన తర్వాత పక్కవారి గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేసాం. వ్యక్తగతమే ముఖ్యమై పోయిన ఈ యాంత్రిక యుగంలో భద్రత కోసం మను షుల కన్నా యంత్రాలను నమ్మడమే నయం అన్నవిధంగా మారిపోయింది. ఇంట్లో పిల్లల భద్రత కోసం సెక్యూరిటీ వెబ్‌క్యామ్‌లా స్మార్ట్ఫోన్లను ఉపయోగించవచ్చు.
ఇంట్లోనే కాదు.. ఆఫీస్‌లోనూ, చిన్న చిన్న షాపుల్లోనూ, ఇంటి చుట్టూ భద్రతకోసం రక్షణ వలయంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదై నా సంఘటన జరిగినప్పుడు వెబ్‌క్యామ్ లా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు అయిన ఫుటేజ్ చాలా ఉపయోగ పడుతుంది. వెబ్‌క్యామ్‌లను ఏర్పాటుచేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకు బదులుగా స్మార్ట్ఫోన్లను సెక్యూరిటీ వెబ్ క్యామ్‌లా మార్చితే తక్కువగా ఖర్చుతో భద్రతవ్యవస్థను ఏర్పాటుచేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లను వైర్లెస్ సెక్యూరిటీ కెమెరాలుగా మార్చే అనేక ఆప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఓల్డ్ స్మార్ట్ ఫోన్‌తో భద్రత వ్యవస్థను ఏర్పాటుచేసుకోవచ్చు.
ఎప్పుడైనా..ఎక్కడైనా దూరప్రాంతాల్లో ఉన్నవారితో వీడియో కాల్లో మాట్లాడాలంటే ఇంట్లో నెట్వర్క్ ఉండాలి. అయితే వీకెండ్లో బయటకు వెళ్ళినప్పుడు వీడియో చాట్కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ హ్యాంగ్అవుట్స్, స్కైప్ వంటి ఆప్‌లను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.
పెద్దలకే కాదు చిన్న పిల్లలు కూడా సంగీతం వింటూ ఆనందిస్తారు. ఇంట్లోనే కాదు.. గార్డెన్‌లోనూ తిరుగుతూ సంగీతం వింటుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో నచ్చిన పాటలను, సినిమాలను స్టోర్ చేసుకుని ఎక్కడైనా.. ఎప్పుడైనా వినవచ్చు.. చూడవచ్చు. వీకెండ్లో బయటకు వెళ్ళినప్పుడు..ఫ్యామిలీతో లాంగ్ టూర్ వెళ్లినప్పుడు ఇవి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి. అంతేకాదు... అరుదైన పుస్త కాలెన్నో ఈ బుక్‌గా అందుబాటులో ఉంటున్నాయి. మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే బుక్స్, అమెజాన్ కైందిట్, పాకెట్ వంటి రీడింగ్ ఆప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనితో మీ స్మార్ట్‌ఫోన్ ఈబుక్ రీడర్లా ఉపయోగించుకోవచ్చు. పెద్ద లైబ్రరీ మీతో పాటు ఉన్నట్టే. వీటితో పాటు పాతస్మార్ట్ఫోన్ను డేటా స్టోరేజ్ డివైస్‌లా , డేటా బ్యాకప్ వాడు కోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోని మెమోరీని సద్వినియోగం చేసుకోవచ్చు. వివిధ రకాల గేమ్‌లను లోడ్ చేస్తే ఇంటర్నెట్ లేకుండా కూడా మీకు ఇష్టమైన, పిల్లలకు ఇష్టమైన గేమ్స్ ఆడుకోవచ్చు.
ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను జీపీఎస్ నేవిగేటర్‌లా కారుకు కనెక్ట్ చేసు కుంటే చాలా సులభంగా మీరు కొత్తప్రదేశానికి వెళ్లే రూట్, ట్రాఫిక్ జామ్ ఏ రూట్లో ఎలా ఉందో తెలియజేసే జీపీఎస్ నేవిగేటర్‌లా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వర్చువల్ టెక్నాలజీని అనుసంధానం చేసి విఆర్ హెడ్ సెట్‌గా ఉపయోగింవచ్చు.
ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ పిక్సెల్‌లో పనిచేసే కెమెరాలు ఉంటున్నాయి. వీటిని వీడియోక్యామ్ మాదిరిగానూ ఉపయోగించవచ్చు.
అందుబాటులోకి వచ్చిన కొత్త ఆప్స్‌కు ఆలోచనను జతచేసి టెక్నాలజీని మంచికోసం ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. మరి ఎందుకు ఆలస్యం.. ఇంట్లో వెస్ట్గా పడిఉన్న ఓల్డ్ స్మార్ట్‌ఫోన్‌తో లేటెస్ట్గా మారండి.
Authorization