మీపాస్వర్డ్ ఎవరికీ తెలియదనుకుంటున్నారా? మీకు తెలియకుండా మీ డివైజ్‌ని ఎవరూ ఓపెన్ చేయలేరనుకుంటున్నారా? మీరు వాడుతున్న డివైజ్‌లో డాటా సేఫ్ అని భావిస్తున్నారా ? అయితే మీరు తప్పులో కాలేసిట్టే.. మీకు తెలియకుండానే మీ డేటా తష్కరించబడుతుంది. దీని కోసం మీ పాస్వర్డ్ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలి. పాస్ వర్డ్‌లో ఎక్కువ క్యారెక్టర్లు ఉన్నంత మాత్రానా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనుకోవద్దు. మీ పాస్వర్డ్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలో కొంది ట్రిక్స్ పాటించండి.
పాస్వర్డ్ ఫ్రీజ్ :పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ యూజర్ కూడా మారాల్సి ఉంది. మీ డివైజ్ పాస్వర్డ్ ఫ్రీజ్‌గా ఉండాలి. అంటే జిగ్‌జాగ్‌గా ఉండాలి. ఇంటి పేర్లు, ఒంటి పేర్లు, ప్రదేశాల పేర్లను అవాయిడ్ చేయండి. క్యాపిటల్ వర్డ్స్, నంబర్స్, ఫంక్షనల్ వర్డ్స్‌తో పాస్వర్డ్ తయారు చేయండి. వీలైనంత పెద్దగా, కాంపెక్స్గా, ప్రాక్టికల్‌గా ఉండాలి. అన్నికంటే ముఖ్యంగా దాన్ని ప్రతీ మూడు నెలలకు ఓ సారి మార్చేయాలి. పుట్టిన తేదీలు, వ్యక్తుల పేర్లు, ఊత పదాలు పెట్టుకోవటం మంచిది కాదు.
ఇలా అయితే హ్యాక్ అయినట్టే : మీ మొబైల్ లేదా కంప్యూటర్ హ్యాక్ కు గురైనట్టు తెలుసుకోవచ్చు. మీరు వాడుతున్న డివైజ్‌లో ఉన్నట్టుంది పాప్ఆప్ప్ రావటం, కొత్త కొత్త ట్యాబ్‌లు రావటం, స్పామ్ మెసెజులు ప్రత్యక్షమవటం జరగుతుంటది. మొబైల్లో అయితే కాల్ మాట్లాడేటప్పుడు ఒక రకమైన బీప్సౌండ్ వినిపిస్తుంటుంది. ఈ రకమైన సిగల్లు హ్యాక్ అయినట్టు సంకేతాలు ఇస్తాయి. వీటిని నివారించడానికి మీ పాస్ వార్డును ఎప్పటికప్పుడూ మార్చుకోవటమే ఉత్తమం.
మీ పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
: https://goo.gl/Lty4Yz
-నవంత్, బాగ్‌లింగంపల్లి
Authorization