ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటం, మొబైల్, నెట్ వాడటం విస్తృతమవటంతో వినియోగదారులు టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫ్రెండ్స్‌తో కాఫీ షాప్‌లో ఉన్నప్పుడైనా, కొలీగ్స్‌తో ఆఫీస్‌లో ఉన్నప్పుడైనా తాము కొనాలనుకున్న వస్తువును ఆన్లైన్ షాపింగ్ వేదికలపై ఇట్టే కొనేస్తున్నారు. ఈ తరహా షాపింగ్ సరదా ఉంటుంది. సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. కానీ ఒక్కో సారీ మనకు తెలియకుండా ఝలక్ ఇస్తాయి. తెలియకుండానే మోసపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కాస్త అవగాహన, జాగ్రత్త పెంచుకుంటే ఇలాంటివి అధిగమించవచ్చు. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు తెల్సుకోవాల్సిన విషయాలు, జాగ్రత్తలపై టెక్‌ప్లస్ స్టోరీ...
''క్రిష్ణ ఇరవై ఏండ్ల కుర్రాడు. అనుకోకుండా ఫ్రెండ్‌కి బిర్యాని పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. రెస్టారెంట్లు దగ్గర్లో లేవు. బయటకెళ్లడానిక టైమూ లేదు. ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. సరిగా అరగంటలో డెలివరీ చేస్తామన్న డెలివరీ బారు గంట తర్వాత వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్లాడు. తీరా ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే ఆర్డర్ చేసిన ఫుడ్ వేరు, వచ్చిన ఫుడ్ వేరు. క్రిష్ణకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరిని సంప్రదించాలో తెలియలేదు. చేసేదేమీ లేక అదే ఫుడ్‌తో సరిపెట్టుకున్నారు.''
రాంబాబు అప్పుడప్పుడూ ఆన్లైన్ షాపింగ్ షాపింగ్ చేస్తుంటాడు. ఒక రోజు తనకు ఇష్టమైన షూ ఆర్డర్ చేశాడు. పేమెంట్కూడా ఆన్లైన్లోనే చేశాడు. వారం రోజుల తర్వాత ప్రొడక్డ్ డెలివరీ అయింది. కానీ సైజ్‌లో తేడా వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు.
పై రెండు ఉదాహరణలు మనకు చాలా చిన్న విషయాలు అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అలాంటివి మనకూ ఎదురవు తాయి. పోతే పోనీలే అనుకుంటాం. డబ్బులు చెల్లించి మరీ బాధపడతాం.. ఆన్లైన్ షాపింగ్ సైట్లనుంచి సరైన సేవలను అందుకోలేక పోతాం. నిజానికి వాటిని సరైన విధంగా డీల్ చేస్తే సమస్య రాదు. చాలా మందికి తెలియక అలాగే తమలో తాము బాధపడుతూ ఉంటారు.
ప్రొడక్ట్ చెకింగ్ : మీరు కొనాలనుకున్న ప్రొడక్డ్ క్వాలిటీ, రేట్ గురించి ముందు చెక్ చేయండి. ఒక్కో సైట్లో ఒక్కో ఆఫర్ ఉండొచ్చు చూడండి. మీరు వెతుకుతున్న సైట్లో ఉన్న రేట్‌ని, మిగతా సైట్ లో ఉన్న రేట్‌ను కంపైర్ చేసుకొండి. ప్రొడక్ట్ కొంటున్నపుడు దాని బ్రాండ్, సెల్లర్ హౌస్ డీటైల్స్ చూడండి. దీంతో పాటు ఇతర వినియోదారులు ఇచ్చి రివ్యూ అండ్ రేటింగ్ చూడండి. ఆ ప్రొడక్ట్ కొని వాళ్లు రివ్యూ ఇస్తుంటారు. దాన్ని చూడటం ద్వారా ఆ వస్తువును కొనాలా వద్ద అనే నమ్మకం కల్గుతుంది.
రాంగ్ డెలివరీనా.. డోంట్ వర్రీ :మీరు కొన్న వస్తువుకు బదులు గా వేరే వస్తువు డెలివరీ అయినా... లేక క్వాలిటీ తక్కువ ఉన్నా చింతించాల్సిన పని లేదు. రిటర్న్ అండ్ రిఫండ్ పాలసీ తెలిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఆన్లైన్ షాపింగ్ సైట్లు ప్రతీ వస్తువుపై నిర్ణీత కాలంలో రిటర్ట్ సర్వీస్ ఇస్తోంది. ఇది గమనించి వస్తువులను కొంటే సరిపోద్ది. ఒక వస్తువు కొన్న తర్వాత నిర్ణీత సమయంలో రిటర్న్ చేయవచ్చు అని ఆయా షాపింగ్ సంస్థలు ఆఫర్ ఇస్తున్నాయి. ప్రొడక్ట్ డెలివరీ స్టేటస్‌లోకి వెళ్లి రిటర్న్ అండ్ రిఫండ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సదరు వస్తువును రిటర్న్ చేయడానికి కారణాలు మనం పొందుపరిచి రిటర్న్ చేయవచ్చు. మీ స్టేట్మెంట్ను అప్రూవ్ చేసిన తర్వాత పిక్ అప్ టైం వాళ్లకి చెప్పాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన టైంకి పిక్ అప్ బారు వచ్చి ప్రొడక్ట్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ప్రొడక్స్ సెల్లర్ హౌస్‌కి చేరుకున్న తర్వాత షాపింగ్ సైట్ అకౌంట్లోకి రిఫండ్ అవుతాయి. మళ్లీ అదే ఫండ్‌తో షాపింగ్ చేయవచ్చు.
డిస్కౌంట్లు , కూపన్లు కూడా డబ్బుని ఆదా చేస్తాయి ...
చాలా వరకు షాపింగ్ సైట్లలో డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి. వాటిని కూడా పరిశీలించండి , ఒక్కో వెబ్ సైట్ ఒక్కోలా ఇస్తుంటారు. వీక్లీ కూపన్లు, మంత్లీ కూపన్లు, ఫెస్టివల్ ఆఫర్లు అంటూ వివిధ రకాల కూపన్లు ఇస్తుంటారు. వాటిని వాడుకోవచ్చు. షాపింగ్ పేమెంట్ చేస్తున్నపుడు కూపన్ కోడ్ ఆప్షన్ ఉంటుంది. ఒక వేళ మన దగ్గర కూపన్ ఉంటే దాని కోడ్‌ని అప్లై చేస్తే డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది.
క్యాష్ అండ్ డెలివరీ బెటర్ : ఒకవేళ ప్రొడక్ట్ కొని, ఆన్ లైన్ మనీ పేమెంట్ చేసిన తర్వాత మోసపోతే ఎలా అని కొందరు భయపడుతూ ఉంటారు. అలాంటపుడు క్యాష్ అండ్ డెలివరీ ని ఎంచుకోవటం ఉత్తమం. టాప్ ఆన్లైన్ స్టోర్లు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ప్రొడక్ట్ చేతికి అందిన తర్వాతే డబ్బులు చెల్లించొచ్చు.
ఈ- పేమెంట్‌తో జాగ్రత్త : కొందరు షాపింగ్ చేసేప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు.క్రెడిట్, డెబిట్, ఈ బ్యాకింగ్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అప్పుడు కొంత జాత్రగ్త వహించాల్సి ఉంటుంది. వాడుతున్న డివైస్‌లో నెట్ స్పీడ్‌గా ఉండేలా చూసు కోవాలి. అది పర్సనల్ డివైజ్ అయి ఉండాలి. పబ్లిక్ వైఫైలతో, నెట్ కేఫ్‌లలో షాపింగ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేయకోవడమే మంచింది. ఫినాన్షియన్ విషయాలను పబ్లిక్ ఫ్లాట్‌ఫాంలలో షేర్ చేసుకోవద్దు.
అప్డేట్స్ గమనించండి : మీరు వాడుతున్న ఆన్లైన్ షాపింగ్ సైట్ ఆప్ అప్డేట్లను ఎప్పుడూ గమనిస్తూనే ఉండండి. అప్డేట్ అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా అప్డేట్ చేయండి. కొత్త సెక్యూరిటీ ఫీచర్లు యాడ్ అవుతూ ఉంటాయి. సేఫ్ షాపింగ్ చేయటానికి ఇది తోడవుతుంది.
మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఆన్లైన్ వేదికగా జరుగుతున్న సేవలలో వినియోదారుడు ఆసంతృప్తి గా ఉంటే కన్య్సూమర్ ఫోరంను ఆశ్రయించవచ్చు. 1995 నాటికి ఇంటర్నెట్ సేవలతో వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేసే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో కేవలం 1 శాతం మాత్రమే ఉండేది. అది ప్రస్తుం ప్రపంచ జనాభాలో 40 శాతానికి పెరిగిందని ఓ అంచనా..
-వినో
Authorization