రింగ్టోన్స్ పెట్టుకోవటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. ఒకే రింగ్లోన్ని ఎక్కువ కాలం ఉంచడం, లేదా రోజుకో రింగ్ టోన్ కొత్తది పెట్టుకోవటం లేదా అసలు రింగ్టోనే పెట్టుకో కుండా ఉండటం... ఒకే రింగ్‌టోన్‌ను వినీ వినీ బోర్‌గా ఫీల్ అయ్యే వారు. కొత్త కొత్త రింగ్టో న్లను పెట్టుకోవాలనుకుంటారు. అయితే ప్రతి సారి టోన్ మార్చటం కొంచెం కష్టమే. అదే ఒకే రోజు రెండు మూడు రింగ్టోన్లు పెట్టుకో వాలని అనుకునే వారికి అయితే ఇంకా కష్టమే.. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒక టోన్, ఆఫీస్‌లో ఉన్నపుడు ఒక టోన్, బాస్‌తో ఉన్నపుడు మరో టోన్ ఇలా వేరియేషన్స్ కోరుకునే వారు ఉంటారు. కాదా.. వారి కోసం Random Ringtone manager App అందుబాటులో ఉంది. ఈ ఆప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు నచ్చిన పాటలను రాన్డమ్గా రింగ్‌టోన్స్‌గా సెట్ చేసుకోవచ్చు. ఒకే రోజు ఒకటికి మించి రింగర్లు పెట్టుకోవాలనుకునే వారికి ఇది ఉప యోగపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారికి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.