ఫేస్బుక్ ఒకరికి టైంపాస్ కావచ్చు. కానీ ఇంకొకరికి అది కాసులు కురిపించే యాప్. ప్రతి నెటిజన్ కాస్త బోర్‌గా ఫీలయినప్పుడో, కాలక్షేపానికో ఫేస్బుక్ వాడటం మామూలే. కానీ మీ ఫ్రీ టైంనే క్యాచ్ చేసుకుని ఫేస్బుక్ కంపెనీ కోట్లు సంపాధిస్తోందనితెలుసా ? ఫేస్బుక్లో, ఇంటర్నెట్లో మీరు చేసే ప్రతి అక్టివిటీపై ఆ కంపెనీ కన్నేసి ఉంచుతోందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీ అభిరుచులను ఫేస్బుక్ పని గట్టి సొమ్ము చేసుకుంటోంది అంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. మీరు చేసే లైక్స్, షేర్స్, కమెంట్స్ కోట్ల రూపాయల విలువైనవి అంటే మీరు ఇదంతా ఉత్తిదే అని కొట్టిపారేయొచ్చు.
కానీ ఇదంతా నిజం.. టైంపాస్ కోసమో, ఎంటర్టెయిన్మెంట్ కోసమో అనుకుని వాడుతున్న ఫేస్బుక్ యాప్‌నకు ఇంకో సైడ్ ఉంది. వ్యాపారం కోసం కోట్ల వినియోగదారుల ప్రైవసీతో చలగాటం ఆడుతూ, టెక్నాలజీ మాటున చేస్తున్న బిజినెస్ ఏంటో చూద్దాం.
ఫేక్ అకౌంట్లతో జర భద్రం.. ఇది మొన్నటి ముచ్చట.. హ్యాకర్స్‌తో పైలం ఇది నిన్నటి మాట.. డిలీట్‌ఫేస్‌బుక్ ఇది ఇవాల్టి నినాదం. యూజర్ల పర్సనల్ డేటాకు రక్షణ కల్పించడంలో ఫేస్బుక్ కంపెనీ విఫలమైందనే వార్తల నేపథ్యంలో, చాటుమాటు ఒప్పందాల్తో బడా కార్పొరేట్ కంపెనీలకు డేటాను అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిందనే వార్తల నేపథ్యంలో నెటిజన్ల ఆగ్రహానికి ఫేస్బుక్ అకౌంట్లు డీయాక్టీవ్ లేదా డిలీట్ అవుతున్నాయి. వినియోగదారులు, కంపెనీలు తమ భద్రత దృష్యా తమకున్న ఫేస్బుక్ అకౌంట్లను డిలీట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్లేబారు వంటి హై ప్రొఫైల్ కంపెనీలు ఫేస్బుక్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాయి. ఇప్పుడు ఇదో ఉద్యమంలా సాగుతోంది. మరి సోషల్ మీడియాలో ఎన్నడూ లేని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, యూజర్ల డేటాకు భద్రత లేదా. ఇలాంటి ప్రశ్నల సంగతేంటో ఓ సారి చూద్దాం పదండి..
సంచలనం.. 'డేటా'చలనం..
2004 ఫిబ్రవరీ 4న లాంచ్ చేసిన ఫేస్బుక్ ఈ దశాబ్ద ఆవిర్భావాల్లో ఒక సంచలనం. వస్తూ వస్తూనే 'ఆర్కూట్'ను నామరూపాల్లేకుండా చేసింది. ఇంటర్నెట్ పెద్దన్నగా ఉన్న గూగుల్ పక్కలో బల్లెంలా మారింది. ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ల యాక్టీవ్ యూజర్లతో అత్యధిక జనాభా ఉన్న వర్చువల్ దేశంలాగా విస్తరించింది. ఒక యాప్ స్థాయిని దాటి అలవాటుగా మారి ఇప్పుడు ఏకంగా వ్యసనంగా తయారయ్యింది. కొత్త ఫ్రెండ్స్.. లైక్సూ.. కామెంట్సూ, షేరింగులు, మీటింగులూ.. ఈవెంట్లూ.. అబ్బో ఫేస్బుక్ అంతా రచ్చరచ్చే. పొద్దున నిద్ర లేచిన్నుంచీ.. నైట్ పడుకునే వరకు గుడ్‌మార్నింగ్ స్టేటస్‌తో మొదలై గుడ్‌నైట్ పోస్టుతో ముగుస్తోంది సగటు నెటిజన్ దినచర్య. ఈ ఫేస్బుక్ యాప్ కొన్నిరోజులకు స్క్రాప్ అవుతుందన్న అంచనాల్ని పటాపంచలు చేస్తూ కొత్త కొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతూ ముందుకు దూసుకుపోయింది. తనను దాటేస్తాయనుకున్న వాట్సాప్, ఇన్స్టాగ్రాం లాంటి యాప్స్‌ను కొనేసి ఇంటర్నెట్ ప్రపంచంలో తనకు అడ్డులేకుండా చూసుకుంటోంది ఫేస్బుక్. తనవీడియో ఫీచర్‌ను మరింత స్ట్రెంథెన్ చేస్తూ ఒక దశలో గూగుల్ ప్రొడక్ట్ 'యూట్యూబ్'కూ చెమటలు పట్టించింది.
ఫేస్బుక్ కు సెకెండ్ సైడ్ ఉందా ?
ఇందాక చెప్పింది అంతాకాయిన్కు వన్‌సైడ్ మాత్రమే.. ఫేస్‌బుక్‌ను కేవలం కాలక్షేపానికే వాడుతున్నాం అని సాధారణ నెటిజన్ అనుకోవచ్చు. కానీ నెటిజన్ ఫ్రీ టైం ఫేస్‌బుక్‌కు పెట్టుబడి. అసలు 'ఫేస్బుక్' అనే యాప్ కాన్సెప్టే వ్యాపారం. యూజర్లకు ఫ్రీ లాగిన్ ఇచ్చి.. కార్పొరేట్ కంపెనీలకు 'యాడ్లు' అమ్ముకోవడం ఫేస్బుక్ ప్రయిమరీ థీం. నువ్వు ఒక లైక్ చేసినా.. ఒక ఫొటో అప్లోడ్ చేసినా.. షేర్ చేసినా.. కామెంట్ చేసినా.. చాటింగ్ చేసినా.. ఫేస్బుక్ నీ ఇష్టాలు.. అలవాట్లు.. అభిరుచులను ఇట్టే పట్టేస్తుంది. నీ అలవాట్లకు తగ్గ ప్రొడక్ట్స్ నీకు అమ్మేందుకు వేదికగా మారుతోంది. ఇలా ఫేస్బుక్ తనంతట తానుగా సింగిల్ బైట్ కంటెంట్ కూడా ఉత్పత్తి చేయకుండా యూజర్లు అప్లోడ్ చేసిన కంటెంట్‌తో లక్షల కోట్ల వ్యాపారం చేసుకుంటోంది. ఇదిచాలదన్నట్టు సుమారు 60 నుండి 70 మల్టీనేషనల్ కంపెనీలకు యూజర్ల పర్సనల్ డేటాను డైరెక్టుగా అమ్ముకుంటోందని అమెరికన్ మీడియా బట్టబయలు చేసేసింది. ఈ వ్యవహారమే డిలీట్‌ఫేస్‌బుక్ క్యాంపెయిన్‌కు ప్రధానం కారణం.
ఫేస్బుక్కే ట్రంప్‌ను గెలిపించిందా?!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించిందెవరంటే 'ఫేస్బుక్కే' అని లీక్ చేసేశాడు 'కేంబ్రిడ్జ్ అనెలిటికా'లో పని చేసిన క్రిస్టఫర్ వైలీ. 2013లో అలెక్జాండర్ కోగన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించి సైంటిఫిక్ రీసెర్చ్ పేరుతో 2 లక్షల 75 వేల మంది అమెరికన్ యూజర్ల డేటాను తీసేసుకున్నాడు కోగన్. ఈ అకౌంట్లతో ఫేస్బుక్ ఫ్రెండ్సైన 50 మిలియన్ల యూజర్ల డేటాను సదరు యాప్‌ద్వారా తస్కరించాడు. ఈ మొత్తాన్ని ఇంగ్లాండ్ బేస్డ్గా నడిచే 'కేంబ్రిడ్జ్ అనెలిటికా' అనే పొలిటికల్ కన్సల్టెన్సీకి కోగన్ అమ్మేశాడు. దీన్ని ఆసరా చేసుకుని 'కేంబ్రిడ్జీ అనెలిటికా' వైస్ ప్రెసిడెంట్ స్టీవ్బెనాన్ 2016లో ట్రంప్‌కు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేశారు. 50 మిలియన్ అమెరికన్ ఓటర్ల/యూజర్ల డేటాను ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఎఫెక్టీవ్‌గా ఉపయోగించారు. ఓటర్ల ఇష్టాయిష్టాలను అనలైజ్ చేసి వారికి నచ్చే అంశాలను 'ఫొటో, వీడియో పోస్టుల' రూపంలో యూజర్లకు చేర్చి వారి మైండ్‌సెట్‌ని ప్రభావితం చేశారు. ఫలితాలూ ట్రంప్‌కు అనుకూలంగా వచ్చేసాయి. 2014లో భారత జనరల్ ఎలక్షన్లో కూడా ఇదే తరహాలో మోడీ బ్రాండ్‌ను పెంచే ఫేక్ క్యాంపెయిన్లు జరిగాయని సోషల్‌మీడియా ఎక్స్పర్ట్స్ ఇప్పుడు నోరు విప్పుతున్నారు.
జూకర్గ్బర్గ్.. ఓ కొంగ ఏడుపు..
ముందునుండే యూజర్ల డేటాతో వ్యాపారం చేసుకుంటుందని పేరున్న ఫేస్బుక్ ఇమేజ్ 'కేంబ్రిడ్జ్ అనెలిటికా' ఉదంతంతో మరింత డామేజ్ అయ్యింది. స్వయానా ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్ బర్గ్ అమెరికా సెనైట్లో కొంగ ఏడ్పులు ఏడ్వాల్సి వచ్చింది. ఫేస్బుక్ యూజర్ల డేటాను సెక్యూర్ చేయడంలో తాము ఫెయిల్ అయ్యామని ఒప్పుకోవాల్సిన తప్పనిసరిపరిస్థితి జూకర్‌కు ఏర్పడింది. రానున్న 2,3 సంవత్సరాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి యూజర్స్ డేటాకు సెక్యూరిటీ కల్పిస్తామని హామీఇచ్చాడీ ఈ ఫేస్బుక్ సీఈవో. మరి ఈ రెండు, మూడు సంవత్సరాలు తమ డేటాను తాము కార్పొరేట్ల చేతిలో అప్పనంగా పెట్టాలా అంటూ నెటిజన్లు ఆన్లైన్ వేధికగా పేద్ద మూవ్మెంట్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో డిలీట్‌ఫేస్‌బుక్ అనే క్యాంపెయిన్ విస్తృతంగా ముందుకు వచ్చింది. స్వయంగా వాట్సాప్ కో ఫౌండర్ బ్రెయిన్ ఆక్టన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో డిలీట్‌ఫేస్‌బుక్ యాష్ ట్యాగ్‌తో పోస్టు చేశాడు. దీంతో పాటు అనేకమంది హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ సంస్థ అఫీషియల్ ఫేస్బుక్ ఖాతాలు వెనక్కి తీసుకున్నాయి.
జాగ్రత్త..!
మన డేటాను పూర్తిగా అమ్ముకుంటున్నారు. దీన్ని గమనించిన తార్వత కూడా పర్సనల్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయకపోవడం మంచిది. లైక్స్, కామెంట్స్, షేర్స్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇదంత లొల్లి మాకెందుకు అనుకుంటే ఫేస్బుక్ యాప్‌నే పూర్తిగా డిలీట్ చేసి ప్రత్యామ్నాయ సెక్యూర్డ్ యాప్స్‌వైపు మారాలి. ఇంత తెలిసాక్కూడా ఫేస్బుక్ మాకో అలవాటుగా మారిపోయిందనుకుంటే జాగ్రత్తపడాలి. మనకు వచ్చే పోస్టులు నిజమా..? అబద్ధమా..! ప్రచారమా?! విచక్షణతో ఆలోచించాలి. 2019 ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో మన 'బలహీనతలను' తెలుసుకుని మన బుర్రల్లో తమ భావజాలాల్ని 'బలవంతం'గా రుద్దేే యంత్రాంగం ఇప్పటికే రెడీగా ఉంది. దీనికోసం వేల కోట్లు పెట్టి సోషల్ మీడియా క్యాంపెయన్లు జోరుగా సాగుతున్నారు. బివేర్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ఫేక్ పీపుల్.
- శ్రీ సుందర్, హైదరాబాద్
సోషల్ మీడియా అనలిస్ట్
9666883818, టb.షశీఎ/రతీఱరబఅసవతీ
Authorization