ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తాతనో.. నాన్ననో.. అమ్మనో లేదా చుట్టా పక్కాల వాల్లనో, ఇంకెవరినో అడిగి తెలుసుకుంటాం.. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చాకా, డేటా ఆఫర్లు పుట్లకొద్ది వచ్చి చేరాకా ఏం తెలుసుకోవాలనుకున్నా జై గూగుల్ తల్లీ అంటోంది ఈ-తరం. చరిత్ర తెలుసుకోవాలన్నా.. టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, రూట్ తెలుసుకోవాలన్నా, న్యూస్ చూడాలన్నా టాపిక్ ఏదైనా గూగుల్ తల్లిని అడిగేయడమే.. మరి మనం అడగిన వెంటనే గూగుల్ ఆ సమాచారాన్ని ఎలా ఇస్తుంది. గూగుల్ తల్లి ఎంత చదువుకుంది. అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది. గూగుల్ చెప్పేవన్నీ నిజాలేనా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
గూగుల్‌కు సొంతంగా ఏమీ తెలీదు. మరి ఇన్ని విషయాలు ఎలా చెప్పేస్తోంది? ఎలా గుర్తుపెట్టుకుంటుందని అంటారా అదే ఇక్కడ ఓపెన్ సీక్రెట్. నెట్ ప్రపంచంలోని అనేక వెబ్సైట్లు, బ్లాగులు, సోషల్ మీడియా యాప్స్, గూగుల్ ప్రొడక్ట్స్‌లో జనం అప్లోడ్ చేసిన పోస్టుల్ని, వీడియోల్ని వెతికి ఇచ్చే 'సెర్చ్ ఇంజిన్' (వెతికిపెట్టే సాధనం) మాత్రమే ఈ గూగుల్. వెతికి పెడుతుంది కానీ తయారు చేసి పెట్టదు. గూగుల్ ప్రొడక్ట్ అయిన యూట్యూబ్, జీ ప్లస్, బ్లాగులు, ట్రాన్స్‌లేటర్, డ్రైవ్, జీమెయిల్ మొదలైనవి ఎలా చేస్తాయి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తప్ప గూగుల్ సొంతంగా ఏ వార్తా రాయదు. ఏ టెక్నాలజీ వీడియో చేయదు. మనం ఏదైనా అడగ్గానే 'కీవర్డ్స్' ఆధారంగా పబ్లిక్కూ, వెబ్స్సైట్స్, బ్లాగ్స్, సోషల్ యాప్స్‌లో రాసిన.. అప్లోడ్ చేసిన విషయాలు తీసుకొచ్చి మన ముందు పెడ్తుంది అంతే. ఆ సెర్చ్ రిజల్ట్స్ 'బ్రాండ్' ప్రచారమా? నిజమా! ఫేకా? అనేది తెలుసుకోవాల్సి మనమే..
ఎలా వెతకాలి?
గూగుల్‌లో ఏదైనా వెతకగానే మొదటి ఒకటి లేదా రెండు రిజల్ట్స్ పక్కన చిన్న అక్షరాల్లో 'యాడ్' అని ఉంటుంది. డబ్బులు పెట్టి ఫ్రంట్ పేజీలో వచ్చేట్లు చేసిన పెయిడ్ ఆర్టికల్స్ ఇవి. ఆ తర్వాత బాగా 'ఎస్ఈఓ' (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ : వెతగ్గానే వెంటనే పైవరుసలో వచ్చేట్లు కీవర్డ్స్, ఈజీ సెర్చబుల్ టెక్నిక్స్‌తో గూగుల్ ఫస్ట్ పేజీలో వచ్చేట్లు చేయడం.) చేసి ప్రమోట్ చేసిన ఆర్టికల్స్ కనిపిస్తాయి. అంటే పెద్దపెద్ద న్యూస్ ఛానెల్స్, డిజిటల్ మీడియా సంస్థలు తయారు చేసిన పోస్టులు అన్నట్టు. గూగుల్ బ్యాకెండ్‌లో ఎలా పనిచేస్తుందో తెలిసిన ఎక్స్పర్ట్స్ ఈ కంపెనీలకు పనిచేస్తారు. వాళ్లు తమ వార్తలే పైన కనిపించేట్టు అప్టిమైజ్ చేసి పెడతారు. కాబట్టి దాదాపు మనకు మొదటి పేజీల్లో యాడ్స్, వండి వార్చిన వార్తలే ఉంటాయి. నిజమైన వార్త తెలియాలంటే కనీసం ఐదు పేజీల అవతల వెతకాలి. మొదటి పేజీలో వచ్చిన పోస్టులకు, ఐదు పేజీల తర్వాత వచ్చిన రిజల్ట్స్‌ని ఓపెన్ చేసుకుని చదివి మనం సొంతంగా ఒక అసెస్మెంట్కు రావాల్సిందే.. తప్ప గుడ్డిగా నమ్మొద్దు సుమీ.
గూగుల్ మ్యాప్స్‌తో జర భద్రం..
ఈ మధ్య కొత్త ప్రదేశానికి పోవాలంటే గూగుల్ మ్యాప్ ఒక మంచి సాధనమయ్యింది. జాగ్రత్త పాటించ కుంటే మాత్రం తీసుకుపోయి నట్టేటా ముంచేస్తది. ఒకే పేరుతో అనేక ప్రాంతాలు ఉన్నప్పుడు ఇప్పటికికే ఎక్కువ మంది సెర్చ్ చేసి ఉన్న ప్లేస్‌ను ముందు వరుసలో చూపిస్తుంది గూగుల్. మనమే విచక్షణ తో వెళ్లే ప్లేసు ఏ రూట్లో ఉంటుంది? దాదాపు ఎంత దూరం ఉంటుందో తెలుసుకున్న తర్వాత గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించాలి. ముఖ్యంగా గళ్లీల్లోకి గూగుల్‌మ్యాప్‌ను నమ్మి వెళ్లకూడదు. మెయిన్ సెంటర్ వరకు గూగుల్ మ్యాప్‌తో వెళ్లినా.. గళ్లీలో మాత్రం మనుషుల్ని అడిగి వెళ్లడం మంచిది. లేదంటే రోడ్మొత్తం క్లోజ్ ఐన డెడ్ ఎండ్‌కు తీసుకుపోయి వదిలేస్తది. గూగుల్ మ్యాప్ కొత్తవాళ్ల కు మంచి సాధనం కానీ మన విచక్షణ గూగుల్కంటే వేగంగా పనిచేసినప్పుడు మాత్రమే.
గూగుల్ కార్పొరేట్ బిడ్డ. ఎవరు డబ్బులు పోస్తే వారి అనుకూల కథనాలు ముందు వరుసలో చూపి స్తుంది. ఐతే ఈ గూగుల్ మనకు పనికి రాదా! అంటే బ్రహ్మాండంగ పనికొస్తది. ఎడ్యూకేషన్, టెక్నాలజీ, ఎంటర్నైమెంట్, న్యూస్ ఇలా నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రతీ విషయాన్ని తెలిసిన (అథెంటిక్) వెబ్సైట్ల ఆర్టికల్స్, వీడియోలు, ఫొటోలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. వెనక పేజీల్లో సాధారణ జనం రాసే అనేక ఉపయోగపడే వెబ్సైట్లు, బ్లాగులూ ఉంటారు ఈ సారి టైమున్న ప్పుడు ఓ లుక్కేయండి. మంచేదో ముంచేదేదో మనమే విచక్షణతో ఆలోచించాలి సుమీ.
- శ్రీసుందర్
9666883818,
ఱ.ఝఙఱఅఱతీరఏస్త్రఎaఱశ్రీ.షశీఎ
Authorization