ఇన్నాళ్లు బ్లూ, బ్లాక్, గోల్డ్‌గా అందుబాటులో ఉన్న రెడ్మి నోట్ 5 ప్రో ఇప్పుడు రెడ్ కలర్లో అందుబాటులోకి వచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ ను రెడ్ కలర్ వేరియంట్‌ను షావోమి లాంచ్ చేసింది. దీంతో మొత్తంగా ఐదు రంగుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ లభ్యమవుతుంది. ఈ డివైజ్ ప్రస్తుతం షావోమి అధికారిక సైట్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఫోన్ త్వరలోనే లభ్యం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెడ్మి నోట్ 5 ప్రొ లాంచ్ అయింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్సెట్ ఫీచర్‌తో వచ్చిన తొలి డివైజ్ ఇదే.
షావోమి లాంచ్ చేసిన రెడ్మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. 4జీబీ ర్యామ్ం64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ం64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది షావోమి. వీటి ధరలు రూ.14,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ షఉటర్ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Authorization