స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన షావోమీ... తన మార్క్ MIUIతో యూజర్లకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాగా మరో 21 ఫోన్లకు MIUI 10 అప్డేట్ రిలీజ్ చేస్తోంది. గెశ్చర్ బేస్డ్ నేవిగేషన్, ఏఐ సెల్ఫీస్తో పాటు క్లాక్, నోట్ యాప్స్‌లో చాలా మార్పులు రానున్నాయి. ఈ ఏడాది జూలైలో MIUI 10 వర్షన్‌ను రిలీజ్ చేసింది. విడతలవారీగా అన్ని ఫోన్లకూ అప్డేట్ అందిస్తోంది. సెప్టెంబర్‌లో రెడ్మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌కు ఈ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మరో 21 ఫోన్లకు అప్డేట్ రిలీజ్ చేస్తోంది.
ఎంఐ 4, ఎంఐ 4ఎస్, ఎంఐ 4సీ, ఎంఐ మ్యాక్స్, ఎంఐ మ్యాక్స్ 2, ఎంఐ మ్యాక్స్ ప్రైమ్, ఎంఐ 5ఎస్, ఎంఐ 5ఎస్ ప్లస్, రెడ్మీ 4, రెడ్మీ 4ఏ, రెడ్మీ 4ఎక్స్, రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 4ఎక్స్, రెడ్మీ 5ఏ, రెడ్మీ నోట్ 5ఏ, రెడ్మీ నోట్ 5ఏ ప్రైమ్, రెడ్మీ నోట్ 5 ప్లస్, ఎంఐ నోట్ 3తో పాటు రెడ్మీ 6 సిరీస్, రెడ్మీ వై2, పోకో ఎఫ్1 ఫోన్లకు ఎంఐయూఐ గ్లోబల్ స్టేబుల్ రోమ్ అప్డేట్ రానుంది. గెశ్చర్ బేస్డ్ నేవిగేషన్, ఏఐ సెల్ఫీస్తో పాటు క్లాక్, నోట్ యాప్స్‌లో చాలా మార్పులు రానున్నాయి.
ఎలా అప్డేట్ చేసుకోవాలి?
MIUI 10 అప్డేట్కు సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాతే అప్డేట్ చేయడం సాధ్యం. సెట్టింగ్స్‌లో ఎబౌట్ ఫోన్ క్లిక్ చేసి సిస్టమ్ అప్డేట్స్ చెక్ చేయాలి.MIUI 10 అప్డేట్ ఉన్నట్టు కనిపిస్తే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.
Authorization