ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. మీ చేతుల్లో కూడా అలాంటి మొబైల్ ఉండే ఉంటుంది. అయితే స్మార్ట్ మొబైల్స్‌లో ఫీచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఒక్కోసారి బాగా హీటెక్కుతుంది. ఈ వేడి దెబ్బకి ఒక్కోసారి మొబైల్స్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొబైల్ హీటెక్కడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించినట్లయితే మన ఫోన్‌ని ఓవర్ హీట్ నుండి రక్షించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఓ సారి చూద్దాం.
ప్రతి కంపెనీ మొబైల్ తయారీ సమయంలో దాని మీద డూప్లికేట్ ఛార్జింగ్ కేబుల్స్ ఉపయోగించకూడదని రాసి ఉంటుంది. ఎందుకంటే డూప్లికేట్ ఛార్జింగ్ వాడినట్లయితే ఫోన్ బ్యాటరీ పాడయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ హీటెక్కడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. కాబట్టి ఒరిజినల్ ఛార్జర్‌ని మాత్రమే ఉపయోగించండి.
చెక్ చేసుకోండి
ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో చెక్ చేసకోవాలి. పగటి సమయంలో అయితే కేవలం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. రాత్రి వేళ అయితే 100 శాతం ఛార్జింగ్ అయ్యేలా చూసుకోండి.
వైఫై
వైఫై వాడకానికి ఫోన్ హీటింగ్కి సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఒక్కోసారి దీని వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వైఫై ఉన్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. కాబటటి వైఫై ఉన్న సమయంలో ఈ యాప్స్‌ని మీరు చెక్ చేసుకోండి.
బ్లూటూత్
బ్లూటూత్ కానీ జీపీఎస్ కానీ అవసరం ఉన్నప్పుడే ఆన్ చేయాలి. అనవసర టైంలో ఆన్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఫోన్ హీట్ కూడా ఎక్కుతుంది. అందుకే బ్లూటూత్, జీపీఎస్ అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసి పెట్టుకోవాలి.
వాడకం తగ్గించండి
మీ ఫోన్ వాడకం వీలయినంతగా తగ్గిస్తే చాలా మంచింది. 24 గంటలు దానితోనే ఉండటం వల్ల మీ మొబైల్ కే కాకుండా మీకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పూర్తిగా తగ్గించాలి
యూట్యూబ్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తే చాలామంచిది. లైవ్ స్ట్రీమింగ్ జోలికి వెళ్లకండి ఒక వేళ వెళ్లినా వీలయినంత తక్కువ సమయం కేటాయించండి.
గేమ్స్ ఆడుతుంటే
ఫోన్ చేతిలో ఉంటే చాలామందికి గేమ్స్ మీదకే దృష్టి పోతుంది. కాస్త ఖాళీ సమయం దొరికినే అదే పనికి గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఇది చాలా ప్రమాదం. దీన్ని వల్ల కూడా ఫోన్ హీటెక్కే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి అలవాటు ఉన్నవారు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.
ప్లాస్టిక్ కవర్లు వద్దు
ఫోన్ అందంగా కనపడాలని ఏవేవో కవర్లు వేస్తుంటారు. వాటి జోలికి వెళ్ళవద్దు. ముఖ్యంగా Plastic, Leather Case ల జోలికి అసలు వెళ్లవద్దు. వీటివల్ల ఫోన్ వేడెక్కే అవకాశాలు చాలా ఉన్నాయి.
డ్యామేజ్ అయితే...
బ్యాటరీ డ్యామేజి అయిందని తెలిస్తే దాన్ని వెంటనే మార్చుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. అలాగే మీ ఫోన్‌ని వాటర్‌కి వీలయినంత దూరంగా ఉంచండి. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో మ్యూజిక్ వినడం లాంటి పనులు చేయవద్దు.
బ్రైట్నెస్ తగ్గించండి
మీరు ఫోన్ వాడే సమయంలో ఫోన్ బ్రైట్ నెస్ని వీలయినంతగా తగ్గించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎక్కువ బ్రైట్ నెస్ మీ ఫోన్ బ్యాటరీని తినేస్తుంది. కాబట్టి మీకు ఎంత కావాలో అంత మాత్రమే సెట్ చేసుకోండి.
కూలింగ్ యాప్స్ వాడండి
జంక్ ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. దీనికోసం కొన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడండి. అలాగే ఫోన్ కూలింగ్ యాప్స్ వాడండి. Cooling Master-Phone cooler, Device cooler Heat Minimizer, Device Cooler - Colling Master, Coolify లాంటి యాప్స్ వాడటం ద్వారా మీ ఫోన్ కూల్ గా ఉంచుకోవచ్చు.
అప్రమత్తంగా ఉండాలి
చాలామంది ఫీచర్స్ బాగున్నాయాన్ని వాటి గురించి ఏమీ తెలుసుకోకుండా నచ్చిన వెంటనే డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే వీటిలో కొన్ని ఫీచర్స్ బ్యాటరీని తినేస్తాయి. ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా కొత్త వాటిని డౌన్ లోడ్ చేసేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Authorization