ఇప్పుడు అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డులు తప్పనిసరి. కానీ ఈ ఆధార్ కార్డు పోయినట్లుయితే? అలాంటి సందర్భాలలో మనకు ఉన్న ఏకైక ఆప్షన్ (UIDAI) వెబ్ సైట్ ద్వారా నకిలి కార్డు పొందటమే. ఈ నేపథ్యంలో UIDAI సరికొత్త సర్వీస్‌ను లాంచ్ చేసింది. మీ ఆధార్‌కార్డు పోతే కేవలం రూ.50 చెల్లిస్తే చాలు మీ ఆధార్ కార్డు పొందవచ్చు. ఈ కొత్త ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా కేవలం 5 రోజుల్లో మీ అడ్రస్‌కు చేరుతుంది.
గుర్తించుకోవాల్సిన మొదటి విషయం...
రిప్రింటింగ్ రిక్వెస్ట్‌ను రైజ్ చేయడానికి మీ ఆధార్‌కార్డు నెంబర్ లేదా పర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (VID)ను గుర్తుపెట్టుకోవాలి.
స్టెప్ 1: పిసి బ్రౌజర్లో WWW.uidai.gov.in సైట్‌ను ఓపెన్ చేయండి. Aadhar service సెక్షన్‌ను ఓపెన్ చేసి Order Aadhaar Reprint (Pilot basis) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. వెంటనే వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్‌కార్డు నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ VID ను అలాగే సెక్యూరిటీ కోడ్ (captcha) ను డైలాగ్ బాక్స్‌లో ఎంటర్ చేయండి.
స్టెప్ 2: మీరు ముందే మీ నెంబర్‌ను రిజిస్టర్ చేసి ఉంటె Send OTP అనే బట్టన్‌ను క్లిక్ చేయండి. ఒక వేళా మీరు రిజిస్టర్ చేసుకోకపోతే if you do not register your mobile number and proceed అనే డైలాగ్ బాక్స్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ ఫోన్ నెంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్ చేయండి. మీ డీటైల్స్‌ను ఒకసారి చెక్ చేసుకొని Make Payment అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి మీకు ఈజీగా ఉన్న మోడ్‌లో పేమెంట్ చేయండి.
స్టెప్ 4: ఈ ప్రక్రియ అంత పూర్తయ్యాక మీకు స్క్రీన్‌పై కన్షర్మేషన్ మెసేజ్ వస్తుంది. అలాగే ఫ్యూచర్ రెఫెర్న్స్ కోసంSRN number మెసేజ్ మీ ఫోన్‌కు వస్తుంది.
నోట్: ఒక వేళ మీరు మీ ఫోన్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోకపోయుంటే స్టెప్ 2లో చెప్పిన విధానంగా enter the mobile number to receive OTP అనే ఆప్షన పై క్లిక్ చేయండి.
స్టేటస్‌ను ట్రాక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి:
- WWW.resident.uidai.gov.in /check-aadhaar-reprint లింక్‌ను ఓపెన్ చేయండి.
- మీ ఫోన్‌కు వచ్చినSRN number ను ఎంటర్ చేయండి.
- సెక్యూరిటీ కోడ్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
Authorization