స్మార్ట్ఫోన్లకు దగ్గర బంధువుల్లా పుట్టుకొచ్చిన మెమరీ కార్డ్‌లు డేటాను స్టోర్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వైరస్ ఇంకా ఇతర కారణాల వల్ల డేటాతో నిండి ఉన్న మెమరీ కార్డ్‌లు కరప్ట్ అవుతుంటాయి. అలా కరప్ట్ అయిన మెమరీ కార్డ్‌లలో మెమరీ అసలు కనిపించదు. అలాంటప్పుడు మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయడం ఎలాగో చూద్దాం...
ముందుగా డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను మీ పీసీలో ఇన్స్టాల్ చేయండి. కార్డ్ రీడర్ సహాయంతో మీ మెమరీ కార్డ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. ఆ తరువాత డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను రన్ చేసి మీ మెమరీ కార్డ్ లోని డేటాను రికవర్ చేసుకోండి.
విండోస్ కంప్యూటర్లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?
ముందుగా మీ ఫోన్లోని డేటా స్టోరేజ్ కార్డ్‌ను మెమరీ కార్డ్ రీడర్ సహాయంతో కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. కార్డ్ రీడర్ పీసీకి కనెక్ట్ అయిన తరువాత స్టార్ట్ మెనూలోని కంప్యూటర్స్‌లోకి వెళ్లి మీ మెమరీ కార్డ్ ఏ రిమూవబుల్ డిస్క్ కింద లిస్ట్ అయ్యిందో చూడండి. ఉదాహరణకు: Removable Disk (M), Removable Disk (H) డ్రైవర్ లెటర్‌ను గుర్తుపెట్టుకోండి. కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి.
మీ పీసీలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వాలంటే కీబోర్డ్ లోని (win +R) షార్ట్ కట్ ను ప్రెస్ చేసినట్లయితే Run డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. రన్ డైలాగ్ బాక్స్ లో షఎస అని టైప్ చేసి శీస బటన్ పై క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్‌లో chkdsk m: /r అని టైప్ చేయండి. ఇక్కడ‘m'అక్షరం డ్రైవ్ లెటర్. మీ డ్రైవ్ ఏ లెటర్లో ఉంటే లెటర్ ను 'ఎ' స్థానంలో రీప్లేస్ చేసి ఎంటర్ను ప్రెస్ చేసినట్లయితే మెమరీ కార్డ్‌లోని ఎర్రర్లను విండోస్ గుర్తించి వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది.
Authorization