మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి ఏదైనా ఫోటోను అనుకోకుండా డిలీట్ చేసారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనుకోకుండా కొన్ని ఫొటోలను తొలగించడం అనేది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీరు డిలీట్ చేసిన ఆ ఫొటోలను తిరిగి పొందడానికి ఈ మూడు యాప్‌ల సహాయం తీసుకోవచ్చు.
DiskDigger Photo Recovery
ఇప్పటికే ఈ Aజూజూ దాదాపు 5 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ఇది Google Play స్టోర్‌లో 4.2 స్టార్స్ అందుకుంది. అంతేకాకుండా 2 మిలియన్లకు పైగా వినియోగదారులు దీన్ని రేట్ చేసారు. ఈ Appపరిమాణం మీరు వాడుతున్న ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ యాప్‌తో డిలీట్ అయిన ఫొటోలను మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇంటర్ఫేస్ కూడా చాలా సులభం.
Deleted Photo Recovery
మీరు Google Play Store లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కూడా ఇప్పటికే 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. ఇది Google ప్లే స్టోర్‌లో 4.3 స్టార్స్ పొందింది. అలాగే ఇది 66,000 వినియోగదారులచే రేట్ చేయబడింది. ఈ అప్లికేషన్ చాలా ఫొటోలను రికవర్ చేస్తుంది. మైక్రో SD కార్డ్, అంతర్గత స్టోరేజ్‌ని కూడా ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. అలాగే దీని అప్లికేషన్ చాలా వేగంగా స్పందిస్తుంది. మీ ఫోన్, మెమొరీ కార్డులో నుండి తెసివేయబడిన ఫొటోలను కూడా త్వరగా తిరిగి తీసుకొస్తుంది.
Restore Image (Super Easy)
ఈ అప్లికేషన్ దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. అంతేకాకుండా Google Play Store లో 4.0 స్టార్లను సొంతం చేసుకుంది. ఇది 65,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు రేటింగును అందుకుంది. ఈ అప్లికేషన్ పరిమాణం 33MBగా ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్లో పైన తెలిపిన అన్ని లక్షణాలను పొందుతారు. మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడానికి మీ ఫోన్‌ను rootచేయాల్సిన అవసరం లేదు.
Authorization