మీ కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చిరాకు పుట్టిస్తుందా..? ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..? ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పీసీలోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని కింద పేర్కొన్న ఈ సూచనలను పాటించండి...
అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి:
ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్వేర్లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్స్టాల్ చేయండి. ఇలా చేయడం వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.
వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:
పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అలాగే యాంటీ వైరస్ అప్డేట్ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.
రీసైకిల్ బిన్ను ఖాళీ చేయండి:
మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. వీటిపట్ల నిర్లక్యంగా ఉండకండి. ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.
ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:
పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఇది కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. అందుకే అలాంటి ప్రోగ్రామ్స్‌ను తగ్గించుకోండి.
అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి:
విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్లను ప్రవేశపెడుతుంది. వీటిని ఉపయోగించుకుంటే పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.
ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి మీ కంప్యూటర్ స్పీడ్‌గా పని చేసేలా చూసుకోండి. దాని వల్ల చిరాకు ఉండదు, మీ సమయం కూడా వృధా కాదు.
Authorization