స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ ఇంటర్నెట్ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతున్నది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. దీనికి తోడు ఎన్నో అవసరాలను ఇంటర్నెట్ తీరుస్తున్నది. అయితే మన ఫోన్లో మనకు తెలియకుండానే కొంత ఇంటర్నెట్ వినియోగం జరిగిపోతుంటుంది. దీని వల్ల డేటా త్వరగా అయిపోతుంది. అయితే సెర్చ్ చేసేటప్పుడు మనకు ఏది అవసరమో దానినే సెర్చ్ చేస్తే డేటా వినియోగం తగ్గుతుంది. మన మొబైల్లో ఇంటర్నెట్ డేటా త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి... బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్న సమయంలో ఏ విధమైన సూచనలు పాటించాలో చూద్దాం.
స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగించే వారందరికీ మొబైల్ డేటాపై అవగాహన ఉంటుంది. ఇంటర్నెట్ కావాలంటే రీచార్జ్ చేసుకోవడం ద్వారా డేటా లభిస్తుంది. వచ్చిన డేటాను లిమిట్ వరకు వినియోగించుకునే వీలుంది.
4జీ డేటా:
ఇటీవల మార్కెట్లో అనేక సంస్థలు 4జీ డేటాను ప్రవేశపెట్టాయి. 4జీ డేటాను తీసుకోవడం వల్ల మనం ఉపయోగించే ఇంటర్నెట్ వేగంగా పని చేస్తుంది. అందువల్ల డేటా మొత్తం ఖర్చయ్యే అవకాశాలున్నాయి. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
వై-ఫై ద్వారా డౌన్లోడ్:
ఈ-మెయిల్ ద్వారా వచ్చే ఎటాచ్మెంట్స్ను వై-ఫై ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఈ మెయిల్స్ ద్వారా పలు అటాచ్మెంట్స్ వస్తుంటాయి. వీటిని ఈ మెయిల్ చూసిన వెంటనే ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయ్యే విధంగా ఉంచకూడదు. ఈ మెయిల్స్‌ను చెక్ చేసుకున్న తర్వాత ఎటాచ్మెంట్స్ ఉంటే వీటిని వై-ఫై అందుబాటులో ఉన్న చోట డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్యమైన వీడియోలను:
ప్రస్తుతం ప్రతి ఆఫీసులోనూ వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మీ మొబైల్లోని డేటా సేవ్ చేసినట్టే. ముఖ్యమైన వీడియోలను వైఫై ద్వారా చూసుకోవడం మంచిది.
ఓపెరా, క్రోమ్ వంటి బ్రౌజర్స్‌లో:
ఓపెరా, క్రోమ్ వంటి బ్రౌజర్స్‌లో డేటా, డేటా కంప్రెషన్ యుటిలిటీ బిల్ట్ఇన్గా వస్తుంది. దీనివల్ల కొంత డేటా యూసేజ్ సేవ్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమేటిక్ అప్డేట్స్ను ఆన్‌లో ఉంచకూడదు. దీనివల్ల అనేక యాప్స్ నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటాయి.
వైఫై పాస్‌వర్డ్‌ను:
ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. వైఫై పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడం ద్వారా మీ మొబైల్ నుంచే నెట్‌ని వినియోగిస్తూ పనులు పూర్తి చేసుకునే వీలుంది.
సెక్యూరిటీ లేకుండా వైఫై:
కొన్ని చోట్ల సెక్యూరిటీ లేకుండా వైఫై ఉంటుంది. ఇటువంటి వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవడం చాలా ఇబ్బంది కరమైన విషయమైనా నెట్‌ను ఇతరులు సులువుగా ఉపయోగిస్తారు. దీని వలన తెలియకుండానే మన ఇంటర్నెట్ డేటా ఖర్చవుతుంది. అందువల్ల మీరు తీసుకున్న నెట్‌కు రూటర్ ద్వారా వైఫై ఉంచినప్పటికీ తప్పకుండా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంచుకోవాలి. పాస్‌వర్డు ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఇతరులు సులువుగా మన నెట్ ఉపయోగిస్తారు.
సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు:
ఇంటర్నెట్ను సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా మనకే ఇబ్బంది వస్తుంది. మనం వినియోగిస్తున్న ఐపీ రికార్డు అవుతుంది. కాబట్టి సమస్యలు తలెత్తకుండా వైఫైను జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
Authorization