ఒకప్పుడు వాట్పాప్‌ను బెంబేలెత్తించిన వాట్సాప్ గోల్డ్ మెసేజ్ మళ్ళీ ఇప్పుడు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫేక్మెసేజ్కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. ఇంకో ఆసక్తికర విషయమేటంటే వాట్సాప్ గోల్డ్ మెసేజ్ ఇప్పుడు రకరకాల రూపాల్లో షేర్ కాబడుతోంది. ఇందులో కొన్ని పేరియంట్స్ రీడైరెక్ట్ కాబడుతుంటే మరికొన్ని మాత్రం ఎర్రర్ మెసేజ్‌ను చూపిస్తున్నాయి.
ఈ మధ్య వాట్సాప్‌లో ఒక ఫేక్ మెసేజ్ హల్చల్ చేస్తోంది. వాట్సాప్ గోల్డ్ పేరుతో ఉంటోన్న ఈ మెసేజ్, దానిని అప్డేట్ చేసుకోమని చెబుతోంది. వాస్తవానికి ఇది అఫీషియల్ అప్డేట్ కాదని, ఇది తెలియని పలువురు ఈ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకుని మాల్వేర్ వలలో చిక్కుకుంటున్నారని టెక్నికల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో వాట్సాప్ సేవలను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య 20 కోట్లకు పైగా ఉంది. ఈ ఫేక్ మెసేజ్ ఇప్పటికే చాలా మందికి రీచ్ అయి పోవటంతో ప్రభావం ఎక్కువగానే ఉంచొచ్చని అంటున్నారు.
వాట్సాప్ గోల్డ్ మెసేజ్: వాట్సాప్ గోల్డ్ మెసేజ్ మొదటిసారి 2016లో వెలుగులోకి వచ్చింది. ఈ వాట్సాప్ వెర్షన్ గోల్డ్ కలర్లో ఉంటుందని, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సాప్‌ని గోల్డ్ కలర్లోకి మార్చుకోవచ్చు అని. ఇది వాట్సాప్ కొత్తగా పెట్టిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని దీనిని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఒకేసారి 100 ఫొటోలను పంపుకునే వీలుంటుందని రకరకాల మెసేజెస్ప్రాచుర్యంలో ఉన్నాయి.
పెద్ద స్కాం: వాట్సాప్ గోల్డ్ ఫీచర్ పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సాప్ ఏదైనా రీలీజ్ చేస్తే అఫిషియల్‌గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్‌లు నమ్మవద్దని వాట్సాప్ సైతం చెబుతోంది. అందువల్ల మీకు అలాంటి మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి.
నకిలీల బెడద: కోట్లాది మంది యూజర్లతో ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్రపంచాన్ని శాసిస్తోన్న వాట్సాప్‌ను నకిలీల బెడద బెంబేలెత్తిస్తోంది. నకిలీ వాట్సాప్ యాప్స్ నుంచి యూజర్లను అప్రమత్తం చేసే క్రమంలో WABetalnfo ఇప్పటికే తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వార్నింగ్ ట్వీట్లను ఇష్యూ చేస్తోంది. ఇటువంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోకండి! ఇవి పూర్తిగా ఫేక్! వాట్సాప్ బిజినెస్ యాప్ అఫీషియల్‌గా ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదు. కాబట్టి అఫీషియల్ చానల్స్‌ను మాత్రమే ఫాలో అవ్వడంటూ యూజర్లను అప్రమత్తం చేస్తున్నది.
Authorization