మొబైల్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న లెనోవొ బ్రాండ్ మోటో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ల మీద ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీ సీరిస్ లో నాలుగు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. బ్రెజిల్లో జరిగిన ఓ ఈవెంట్లో Moto G7,G7 Plus, G7 Power , G7 Play ను విడుదల చేసింది. మోటో లైనప్ ఫోన్లకు భిన్నంగా కొత్త లుక్లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్ఫోన్ మొదటిలుక్లోనే అందరిని ఆకట్టుకుంది. ఈ కొత్త ఫోన్ల ధర, ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే...
Moto G7:
ధర రూ. 21,300
ఫీచర్లు: 6.24 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2340 x 1080 ఫిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 5 మెగాఫిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాఫిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.
G7 Plus
ధర రూ. 24,500
ఫీచర్లు: 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2340 x 1080 ఫిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాఫిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
G7 Power
ధర రూ.14,200
ఫీచర్లు: 5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1520x720 ఫిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8 మెగాఫిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
G7 Play
ధర రూ.17,800
ఫీచర్లు: 6.22 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1.8 గిగాహెడ్జ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాఫిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.