ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. ప్రతి రోజు సగటున నాలుగు గంటలు స్మార్ట్‌ఫోన్ మీద కాలం గడుపుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో అనవసరమైన వాటినే ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఇది మరింత ఎక్కువైపోయింది. ఫోన్లతోనే గడుపుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మంచి ఫీచర్లు ఉన్నా అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అవి ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని ఫీచర్లు మీకోసం...
హుడ్ వే
మీరు ఎప్పడైనా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు రూటు సరిగా తెలియకుంటే గూగుల్ మ్యాప్‌ని ఆశ్రయిస్తుంటారు. అయితే అది చీకటిగా ఉన్న సమయంలో డార్క్ లోనికి వెళుతుంది. ఇలా డార్క్ లోకి వెళ్లినప్పటికీ మీరు వెలుతురు ఉండే విధంగా సెట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు Hudway ని మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
బార్ కోడ్స్
మీరు ఎక్కడైనా షాపింగ్ చేసే సమయంలో అక్కడ కనిపించే బార్ కోడ్ వివరాలను మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.USPS, UPS, and FedEx systems లో మీరు మీ మొబైల్ స్కాన్ చేసినప్పుడు ఆ వివరాలు మీ మొబైల్‌లోకి వస్తాయి. దీంతో పాటు ఆ వివరాలను మీరు RedLaser యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
టెలిస్కోప్
మీ ఫోన్‌ని టెలిస్కోప్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ లెన్స్ నేరుగా టెలిస్కోప్‌కు పెట్టినప్పుడు మీ ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది.
హార్ట్ రేట్
Instant Heart Rate ఉపయోగించి మీరు మీ హార్ట్ రేట్‌ని తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ రెండి సిస్టంలలో ఇది అందుబాటులో ఉంది.
డిజిటైజ్ నెగిటివ్స్
HELMUT Film Scanner యాప్స్ ఉపయోగించి దీనిని తెలుసుకోవచ్చు.
ఫాంట్స్‌ని కెమెరా
HELMUT Film Scanner ఉపయోగించి మీరు ఫాంట్స్ , ప్లేస్, లాంటి వివరాలను టెక్స్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
వీడియో రికార్డింగ్
ఇది అందరికీ తెలిసిన విషయమే. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఫొటోలు వీడియోలు తీసుకోవచ్చు.
రూలర్
Ruler App ఉపయోగించి మీరు మీ కెమెరా ద్వారా అన్ని రకాల కొలతలను తెలుసుకోవచ్చు.
ధర్మల్ కెమెరా
కెమెరాను మీ ఫోన్ కి అటాచ్ చేయడం ద్వారా మీరు ధర్మల్ ఇమేజ్ ని చూడవచ్చు. మీ చుట్టుపక్కల ఏముందో వెంటనే పసిగట్టవచ్చు.
Authorization