ఈ మధ్య కాలంలో చాలామంది మెసేజ్‌లు తెలుగులో టైప్ చేసిపంపుతున్నారు. ఇవి అందరికీ అర్థమయ్యేలా వీలుగా ఉంటాయి. అయితే కొంత మందికి తమ ఫోన్లో తెలుగులో టైప్ చేసుకోవచ్చనే విషయమే తెలియదు. తెలిసినా మరికొంతమందికి ఎలా ఉపయోగించాలో రాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ చిన్న వ్యాసం...
ఇది గూగల్ ఆండ్రాయిడ్ ఫోనులలో మాత్రమే పనిచేస్తుంది. ప్లే స్టోర్ నుండి Indic Keyboard Prime ను డౌన్లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మీరు చేయవలిసిన స్టెప్స్‌ను వివరిస్తుంది. వాటిని స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చదివి పూర్తి చేయండి. అయితేSelect Languages అని చూపించే 3 స్టెప్‌లో Configure Languages మీద టచ్ చేయండి. ఇప్పుడు Use System Language ఆప్షన్‌ను UnClick చేసి, Active Input Methods కింద ఉన్న English ను టిక్ చేయండి (ఇది మీరు తెలుగు కీ బోర్డ్ నుండి వెంటనే ఇంగ్లిష్ కీ బోర్డ్‌కు వచ్చేందుకు ఉపయోగపడుతుంది). తరువాత కిందకు స్క్రోల్ చేస్తే తెలుగుకు సంభందించి 5 ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో ''తెలుగు - లిప్యాంతరీకరణ'' ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇది సులువుగా Tinglish లో టైప్ చేయటానికి. మిగిలిన 4 తెలుగు ఆప్షన్స్ కష్టతరమైన తెలుగు టైపింగ్ ప్రోసేస్లు. ''తెలుగు - లిప్యాంతరీకరణ'' సెలెక్ట్ చేయగానే మీ ఫోన్ బ్యాక్ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ కు రండి. దీంతో మీరు తెలుగులో టైప్ చేయటనికి కీ బోర్డ్ ను కాన్ఫిగర్ చేయటం పూర్తి చేసినట్లే.
ఎలా చేయాలి?
తెలుగులో టైప్ చేయడం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంగ్లీష్‌లో పదాలను ఎలా టైప్ చేస్తారో ఇది అలాగే టైప్ చేయాలి. మనం సాధారణంగా మెసేజింగ్ చేసేటప్పుడు Tinglish వాడుతాం.Tinglish అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌తో తెలుగు రాయటం (Eg: Ela Unnaru) . Indic Keyboard Prime లో Ela unnaru'' అని టైప్ చేస్తే అది ''ఏలా ఉన్నారు'' అని ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసి తెలుగులో చూపిస్తుంది. ఇక వొత్తులు, దీర్ఘాలు కావాలంటే కేవలం మీకు కావలిసిన లెటర్స్‌ను రెండు సార్లు టైప్ చేస్తే వొత్తులు వస్తాయి. అదే ఆల్ఫాబెట్‌ను కేపిటల్లో టైప్ చేస్తే దీర్ఘం వస్తుంది. ఇక ప్రత్యేకంగా (సున్నా - 'o') కావాలి అంటే 'M' లెటర్ ను కేపిటల్లో టైప్ చేస్తే వస్తుంది. మాముల ''m'' టైప్ చేస్తే ''మ్'' అని వస్తుంది. ఇండిక్ ప్రైమ్ కీ బోర్డ్ నంబర్స్‌ను టైప్ చేయటానికి డెడికేటెడ్ నంబర్స్ బటన్‌ను కూడా ఇస్తుంది కీ బోర్డ్ లో. మీరు తెలుగు నుండి వేరే భాషకు మారాలని అనుకుంటే స్పేస్ బార్ మీద 2 సేకేండ్స్ ప్రెస్ చేసి ఉంటే, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవటానికి అందుబాటులో ఉన్న కీ బోర్డ్ ఆప్షన్స్ వస్తాయి.
Authorization