పుల్వామాలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు మీరూ సహాయం చేయాలనుకుంటున్నారా? ఇప్పటికే సెలబ్రటీలు వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కొంత మందికి సహాయం చేయాలని ఉన్నా ఎలా చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే Paytm, PhonePay వారు ఓ మైక్రోసైట్ అందించారు. దీని ద్వారా నేరుగా ఆ కుటుంబాల వారికే మీరు సాయం చేయవచ్చు. అదెలాగో చూద్దాం.
Paytm ద్వారా: Paytm ఆన్లైన్లో అందించిన మైక్రోసైట్పై ప్రెస్ చేయాలి. అందులో మీకు విరాళాన్ని యెవరికి ఇస్తున్నారో ముందుగానే సెలక్ట్ చేసి ఉంటుంది. అంటే CRPF Wives Welfare Association అని ఉంటుంది. ఇక్కడ మీ పేరు, మీకు తోచిన అమౌంట్‌ని టైప్‌చేసి మీ Paytm వాల్లెట్ అకౌంట్ నుండి నేరుగా పంపించండి. ఎక్కువ మొత్తంలో అమౌంట్ పంపించదలిచిన వారు మాత్రం పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
PhonePay ద్వార: PhonePay నుండి విరాళం పంపించాలన్నా కూడా ఆన్లైన్లో అందించిన మైక్రోసైట్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ నిదీష్ట్రaతీaస ఖవ Vవవతీు పేరుతో ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది. మీరు విరాళంగా ఇవ్వదలచిన అమౌంట్‌ను టైప్ చేసి, మీ అకౌంట్ నుండి నేరుగా Bharak Ke Veer కు సంబంధించిన ఎస్బీఐ అకౌంటుకు పంపవచ్చు.
నేరుగా పంపడం ఇలా...
ఇండియన్ గవర్నమెంట్ అందిస్తున్న WWW.bharatkeveer.gov.in వెబ్సైట్ ద్వారా నేరుగా పంపవచ్చు. ముందుగా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. గైడ్‌లైన్స్ చదువుకున్న తర్వాత Click Here To Conrtribute పైన ప్రెస్ చేయాలి. అక్కడ Bharak Ke Veer Corpus Fund అని కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేసి మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి ఎంటర్ చేయాలి. దాంతో మీకు OTP వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మీ పేరు, ఈ మెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా మీకు అకౌంట్ ఉన్న బ్యాంకును సెలక్ట్ చేసుకుని మీకు నచ్చిన అమౌంట్‌ను పంపిచవచ్చు.
Authorization