మీరు ఏదైనా చీకటి ప్రదేశంలోకి వెళ్లినప్పుడు అక్కడ మీరు వెంటనే ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెలుతురుని సెట్ చేస్తుంటారు. అయితే ఒక్కో సారి ఫ్లాష్‌లైట్ వెలుతురు మనం అనుకున్నంతగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు లైట్ కోసం ప్రత్యామ్నాయం కోసం వెదుక్కోవాల్సి వస్తుంది. అయితే ఆపిల్ ఐ ఫోన్లలో అలాంటి సమస్య లేకుండా నేరుగా ఐఫోన్ ఫ్లాష్ లైట్ లైటింగ్ పెంచుకునే అవకాశం ఉంది. ఆపిల్ ఐఓఎస్ ఆఫరేటింగ్ సిస్టం ఈ అవకాశాన్ని కల్పించింది. అది ఎలా పెంచుకోవాలో చూద్దాం...
మన ఆపిల్ ఐ ఫోన్ల ఫ్లాష్లైటింగ్ పెంచుకునేందుకు అనేక రకాలైన ఫీచర్లు ఉన్నాయి. రికార్డు స్క్రీన్, మ్యూజిక్, స్లీప్ టైమర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు సీక్రెట్ ఫీచర్ ఫ్లాష్ లైట్ బ్రైట్ నెస్ కూడా ఉంది.
ఐఫోన్ 6ఎస్
మీరు ఐఫోన్ 6ఎస్ అలాగే ఐఓఎస్ వర్సన్ 11 ఆ పైన మాత్రమే ఈ ఫీచర్ ని చూడగలరు. మొత్తం 4 లెవల్స్ లో మీరు బ్రైట్ నెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అవిlevel 1, level 2, level 3 and level 4. మొత్తం iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus and iPhone 6s లలో మీరు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
iPhone X,XS,XS Max, XR లలో ..
- ఐఫోన్ అన్ లాక్ చేయండి
- ఐఫోన్ కంట్రోల్ సెంటర్‌ని యాక్సస్ చేయండి
- అక్కడ ఫ్లాష్ లైట్ ఆఫ్సన్ని ట్యాప్ చేయండి
- ఆ toggle ని లాంగ్ ప్రెస్ చేయండి
- అక్కడ మీకు బ్రైట్ నెస్ ఆప్షన్లు కనిపిస్తాయి
- అందులో మీకు నచ్చిన ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు.
Authorization