ఇది 6.2 అంగుళాల HD+ ఇన్ఫినిటీ v- డిస్ప్లేతో ఉంటుంది. అంటే, V వలె ఉండే వాటర్ డ్రాప్ నోచ్ అన్నమాట. దీని ఆప్టిక్స్ పరంగా చూస్తే వెనుక భాగంలో కేవలం 13MP సింగిల్ కెమెరాతో పాటుగా ముందు 5MP సెల్ఫీ కెమేరాతో ఉంటుంది. అలాగే ఫేస్ రికనైజేషన్ సపోర్టుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక Exynos 7884 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 3GB ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ రెడ్, బ్లూ , బ్లాక్ రంగులలో, 3,400mAh బ్యాటరీతో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ A30
ఇది 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. అలాగే 4,000 mAh బ్యాటరీ ఇందులో అందించింది. అలాగే ఆప్టిక్స్ పరంగా చూస్తే వెనుక భాగంలో 16MP+5MP డ్యూయల్ కెమెరాతో పాటుగా ముందు 16MP సెల్ఫీ కెమేరాతో అందించబడింది. ఇంకా 3D Arc డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Exynos 7904 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 4GB ర్యామ్ జతగా వస్తుంది. రెడ్, బ్లూ, బ్లాక్ రంగులలో లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ A 50
ఈ ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమేరా ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమేరాతో జతగా మరొక 5MP డెప్త్ కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ని ఉపయోగించి కాంట్రాస్ట్, బ్రైట్, కలర్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది.
Authorization