ప్రముఖ టెక్నాలజీ కంపెనీ 'కింగ్స్టన్' గేమింగ్ డివిజన్ 'హైపర్‌ఎక్స్' ప్లే స్టేషన్ 4 కోసం గేమింగ్ హెడ్సెట్ ఆవిష్కరించింది. అధికారికంగా సోనీ ఇంటర్ ఆక్టివ్ ఎంటర్టైన్మెంట్ రూపొందించిన హెడ్ సెట్. దీన్ని ప్లే స్టేషన్ 4 గేమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కాంప్లిమెంటరీ ప్లే స్టేషన్ 4 నీలి రంగులో, హైపర్‌ఎక్స్ కంఫర్ట్ రూపంలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టేషన్ 4 కోసం సిద్ధం చేసిన హైపర్‌ఎక్స్ క్లౌడ్ అన్ని ఆన్ లైన్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. రెండు సంవత్సరాల వారంటీతో రూ.9,900లకు లభిస్తుంది.
అత్యున్నత స్థాయి నాణ్యత గల శబ్ధంతో 53 డ్రైవర్లను హైపర్‌ఎక్స్ క్లౌడ్ ఆఫర్ చేస్తోంది. సులువుగా వాడడానికి వీలుగా దీన్ని అల్యూమినియం ప్రేమ్‌తో రూపొందించారు. ఇన్‌గేమ్ చాట్‌లో డిటాచబుల్ మైక్రో ఫోన్, మొబైల్ మ్యూజిక్ కోసం గేమింగ్ తొలిగింపు వంటి అవకాశాలు ఉన్నాయి. హైపర్‌ఎక్స్'ఎస్ సిగేచర్ మెమొరీ ఫోమ్, సాఫ్ట్ లెథరీట్టె కుషన్స్, అడ్జస్టబుల్ హెడ్ బాండ్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు.
హైపర్ ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ పరేఖ్ మాట్లాడుతూ కన్సోల్ గేమింగ్ మార్కెట్లోకి విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్లే స్టేషన్ 4 వల్ల సామూహికంగా ప్రేక్షకులు, కస్టమర్లతో మమేకం కావడానికి వీలు కలిగిందన్నారు. కాంపిటీటివ్ గేమర్ల కోసం ప్రత్యేకండా రూపొందించిన ఉత్పత్తులకు హైపర్‌ఎక్స్ మద్దతుదారుగా ఉంటుందన్నారు.
స్పెషికేషన్లు
హెడ్ ఫోన్: డ్రైవర్- డైనమిక్, నియో డైమియం మాగెట్స్తోపాటు 53 ఎంఎం కలిగి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ 15హెచ్జడ్-25000 హెచ్జడ్
మైక్రోఫోన్: ఎలిమెంట్- ఎలెక్ట్రెట్ కండెన్సర్ మైక్రోఫోన్, నాయిస్ క్యాన్సలింగ్, ఫ్రీక్వెన్సీ: 50హెచ్జడ్ - 18 వేల హెచ్జడ్
Authorization