ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు.. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలను కున్నప్పుడు.. ఫోన్ కాల్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు అందరూ చేసే మొదటి పని ఫోన్ సైలెంట్లో పెట్టుకోవడం. అలా సైలెంట్లో పెట్టి ఒక్కోసారి మర్చిపోతాం. అప్పుడు ఆ ఫోన్ ఎక్కడపెట్టామో తెలుసుకోవడం చాలా కష్టం. ఎన్ని సార్లు ఫోన్ చేసిన రింగ్ అవుతుంది. కాని శబ్దం వినిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫోన్ వెతికి పట్టుకోవడం ఎలా...
Find My iPhone:
Find My iPhone అని పిలిచే ఫీచర్ గురించి ఐఫోన్ ఉపయోగించే వారందరికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఫోన్ పోతే ఈ ఫీచర్‌తో లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. అలాగే ఫోన్ లాక్ కూడా చేయొచ్చు. అయితే ఈ ఫీచర్ ద్వారా సైలెంట్ మోడ్ లేదా Do Not Disturb mode లో ఉన్న ఫోన్ ఐఫోన్‌ను కూడా రింగ్ చేయగలదు అదెలాగంటే... దీన్ని ఉపయోగించుకోవాలంటే మీ ఐఫోన్ లో ఇంటర్నెట్ కచ్చితంగా ఉండాలి. అలాగే మీ ఫోన్ సెట్టింగ్స్ లో 'Find My iPhone' యాక్టివేట్ చేసి ఉండాలి
- Mac లేదా PCలో 'www.icloud.com' ను ఓపెన్ చేసి సరైన క్రెడెన్షియల్స్‌లో లాగ్ ఇన్ అవ్వండి
- లాగ్ ఇన్ అయ్యాక లెఫ్‌లో ఆపిల్ అకౌంట్‌తో కనెక్ట్ అయ్యి ఉన్న డివైజెస్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. అందులో ఐఫోన్‌ను క్లిక్ చేయండి
- కుడివైపు ఉన్న మ్యాప్ ఫోన్ స్థానం ను 3D రెప్రెసెంటేషన్తో జూమ్ చేస్తుంది. స్క్రీన్ కింద 'Play Sound' అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి.
- ఫోన్ ఇంటర్నెట్కు కనెక్టయి ఉంటే ఫోన్ నుంచి పెద్ద సౌండ్‌తో రింగ్ వినిపిస్తుంది. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని మీ ఐఫోన్ ను తెచ్చేసుకోండి.
Authorization