చైనాకు చెందిన షియోమీ సంస్థ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను 'రెడ్మీ ఎయిర్‌డాట్స్' పేరుతో విడుదల చేసింది. ఇందులో యాపిల్ సిరి, గూగుల్ వాయిస్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా ఈ హెడ్సెట్ పనిచేస్తుంది. 26.6x16.4x 21.6 ఎం.ఎం డైమెన్షన్లో ఈ కొత్త హెడ్‌సెట్‌ను రూపొందించారు. ఈ హెడ్సెట్లో 4 గంటల బ్యాటరీ బ్యాకప్ వచ్చేలా 40 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. చైనాలో దీని ధర 99.9 యువాన్లు ఉంది. అంటే మన ధర ప్రకారం రూ.1020కు వినియోగాదారులకు లభ్యమవుతుంది. ఏప్రిల్ 19 నుంచి అక్కడి వినియోగదారులకు ఈ హెడ్సెట్ లభ్యమవుతోంది. గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారన్న విషయంపై ఎలాంటి స్పష్టత సంస్థ వెల్లడించలేదు. దీని బరువు 4.1 గ్రాములు. ఇందులో మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి అవసరమైన టాపింగ్ బటన్‌ను ఏర్పాటు చేశారు. వాయిస్ అసిస్టెన్స్ కోసం డబుల్ టాప్డ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.RTL8763BFR చిప్‌సెట్‌ను రూపొందించారు. ఈ చిప్ ఏర్పాటు చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌కు తక్కువ సమయంలోనే ఇది కనెక్ట్ అవుతుంది. హెడ్సెట్ కోసం ఇచ్చిన కేస్ ద్వారా కూడా చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కేస్‌లో 300 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 12 గంటల పవర్ బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. 62x40x27.2 ఎం.ఎం డైమెన్షన్లో ఈ కేస్‌ను రూపొందించారు. దీని బరువు 35.4 గ్రాములు ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Authorization