అమెరికా పరిశోధకులు కృత్రిమ డీఎన్ఏ లక్షణాలున్న జన్యు పదార్థాన్ని సష్టించారు. దీనిని అప్లైడ్ మాలిక్యులర్ ఎవల్యూషన్ ఫౌండేషన్‌కు చెందిన పరిశోధకులు తయారు చేశారు. విశ్వంలో డీఎన్ఏ ఆధారిత జీవానికి ప్రత్యామ్నాయాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ విధంగా వారు తేల్చి చెప్పారు. భూమిపై ఉండే జీవంలోని డీఎన్ఏలో న్యూక్లియోటైడ్‌లుగా ఉండే నాలుగు కీలకమైన భాగాలు ఉంటే, కత్రిమంగా సృష్టించిన జన్యు పదార్థంలో ఎనిమిది భాగాలు ఉన్నాయి. ఈ డీఎన్ఏ తరహాలోనే జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుని, మార్పిడి చేసే లక్షణం ఉంది. గ్రహాంతర జీవం కూడా ఇలాంటి డీఎన్ఏతో ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. వాటిని అన్వేషించే మార్గాలను మెరుగు పరుచుకునేందుకు తాజా ఆవిష్కరణ దోహదపడుతుందని భావిస్తున్నారు.