ప్రయాణికులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అందుకు అనుగుణంగా సౌకర్యాలు పెరుగుతున్నాయి. ఎక్కడికైనా సరే త్వరగా ప్రయాణం చేయాలనుకుంటే కాబ్ బుక్ చేసుకునే వారున్నారు. ఈ సేవలు తర్వాతి కాలంలో ఆటోలకూ అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహాలో ఇపుడు బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొంత కాలం క్రితం ప్రారంభమైన ఈ సర్వీసు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.. త్వరగా గమ్యాలకు చేరాలనుకునే వారికే కాదు.. డ్రైవింగ్ వచ్చి, అదనపు ఆదాయం కావాలనుకునే వారికీ ఇది ఓ చక్కని అవకాశం. సర్వీసు కోరుకునే వారికి సులువుగా గమ్యానికి చేర్చడంతో పాటు ఆదాయం కావాలనుకునే వారు
కేటాయించే సమయాన్ని బట్టి
సంపాదన పెంచుకోవచ్చు..
మన దేశంలో ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, పూణె, కోల్‌కతా, ఇండోర్, అహ్మదాబాద్, జైపూర్, గౌహతి, మైసూరు, చండీఘర్ వంటి ప్రధాన నగరాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం మొదలగు నగరాలలో బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించి, త్వరగా గమ్య స్థానాలకు చేరాలనుకునే వారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాక క్యాబ్, ఆటోలతో పోలిస్తే చార్జీలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అంతేకాక ఒక్కరే ప్రయాణం చేయాలనుకుంటే బైక్‌ట్యాక్సీ సులువుగా ఉంటుంది.
అందుబాటులో మూడు రకాల యాప్స్
రాపిడో, ఉబర్, ఓలా, అనే రకాల యాప్స్ బైక్ ట్యాక్సీకి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక్కో దానికి ఒక్కో రకమైన వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు ఓలాలో బైక్ పెట్టాలనుకుంటే రైడ్లను బట్టి ఇన్సెన్టివ్స్ ఉంటాయి. రాపిడోలో అయితే రైడింగ్ కిలోమీటర్లను బట్టి ఆదాయం ఉంటుంది.
ఓలా : ఇది అన్ని ప్రధాన నగరాలలో అందుబాటులో ఉంది. పార్ట్ టైమ్ జాబ్ కావాలనుకునే వారు బైక్ ద్వారా సంపాదించుకునే వీలుంటుంది. ఇందులో ఫిక్స్డ్ శాలరీ ఏమీ ఉండదు. ఎంచుకునే రైడ్స్‌ను బట్టి ఇన్సెన్టివ్స్ ఉంటాయి. సమయానుకూలతను బట్టి ఎక్కువ రైడ్స్ ఎంచుకుంటే అదే రీతిలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు కూడా మిగిలిన వాటితో పోలిస్తే ఇందులో చార్జిలు కొంచెం అధికంగానే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వెళ్లాల నుకుంటే మాత్రం క్యాబ్ బుక్ చేసుకోక తప్పదు.
రాపిడో యాప్ : బెంగుళూరులో ప్రారంభమైన ఈ సర్వీసు చాలా బాగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ సర్వీసు హైదరాబాద్‌లోనూ అందుబాటులో ఉంది. అంతేకాకుండా తక్కువ ధరకు వస్తుండ డంతో అక్కడి వారు ఈ రాపిడోనే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇది కేవలం బైక్ ట్యాక్సీ ప్లాట్‌ఫాం.. కిలో మీటరుకు రూ.3 నుంచి రూ.8 వరకు చార్జ్ చేస్తారు. దీనిని దాదాపు 10 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని అడిగిన వివరాలు నమోదు చేస్తే మనం సర్వీసును కావాలను కున్నపుడు వాడుకోవచ్చు. ఇందులో వాలెట్ కూడా అందు బాటులో ఉంటుంది. ఎకౌంట్ నుంచి డబ్బులు పంపించుకుని దాని ద్వారా కూడా పేమెంట్స్ చేయవచ్చు. ఈ యాప్‌ను స్నేహితులకు రిఫర్ చేయవచ్చు. వారు మనం పంపించే కోడ్‌ను ఉపయోగించి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే మనకు రూ.50 యాప్ ద్వారా వస్తాయి. ఇందులో బైక్ ద్వారా ఆదాయం సంపాదించు కోవాలనుకుంటే అందుకు సంబం ధించిన రాపిడో కెప్టెన్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని, వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అవకాశాన్ని బట్టి రైడ్‌కు వెళ్ళవచ్చు. పార్ట్ టైం ఫుల్ టైం అంటూ ఏమీ ఉండదు. యాప్‌లో ఆప్షన్ ఉంటుంది.. అవకా శాన్ని బట్టి అందుబాటులో ఉన్నట్టు యాప్‌లో సెట్ చేస్తే రైడ్‌కు వెళ్ళవచ్చు. వెళ్ళిన రైడ్స్‌ను బట్టి ఆదాయం ఉంటుంది.
ఉబర్ : ఉబర్‌కు సంబంధించి బైక్ ట్యాక్సీ సేవలు ఉబర్ మోటో ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటి మూడు కిలోమీటర్లకు రూ.20 ఉంటుంది. 3 నుంచి 5 కిలో మీటర్లకు రూ.30, 5నుంచి 8 కిలోమీటర్లు రూ.50 ఉంటుంది. ఈ సర్వీసును వినియోగించు కోవాలనుకుంటే యాప్ ఇన్స్టాల్ చేసుకుని పికప్, డ్రాప్ లోకేషన్స్ ఎంటర్ చేస్తే దానిని బట్టి ఎంత చార్జ్ అవుతుందో తెలుస్తుంది. జీపిఎస్ ట్రాకింగ్ ద్వారా రైడర్ వచ్చి పికప్ తీసుకుంటారు. వారే ప్యాసింజర్‌కు హెల్మెట్ కూడా ఏర్పాటు చేస్తారు.
Authorization