మొబైళ్ళ తయారీలో ప్రపంచ దిగ్గజమైన మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్చి 25న ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. మోటో జీ7 లోని ఫీచర్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో స్క్రీన్ డిస్ప్లే 6.24 అంగుళాలు ఫుల్ హెచ్ డి ప్లస్ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మోటో జీ7 ప్లస్, మోటో జీ7పవర్, మోటో జీ7 ప్లేలు అందుబాటులో ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, డ్యుయల్ కెమెరాలు, స్టాక్ ఆండ్రాయిడ్ 9.0 పై వంటి ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి,. ఇండియాలో మోటో జీ7 ధర ఎంత ఉందనే దానిపై అధికారికంగా ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అమెరికాలో 299 డాలర్లు అంటే.. మన ధర రూ.21,360 అని అంచనా. ఈ ఫోన్ మోడల్‌ను 2018లో బ్రెజిల్ లో రిలీజ్ చేశారు. మోటో జీ7 కొత్త స్మార్ట్ ఫోన్ హైలెట్స్, ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం...
ఫీచర్లు ....
6.24 అంగుళాలు (1080x2270 ఫిక్సల్స్) ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ప్లే, టీయర్ డ్రాప్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్, క్వాలికామన్ అక్టో-కోర్ స్నాప్ డ్రాగన్ 632 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ఎక్స్ పాండబుల్ మైక్రో ఎస్డీ, స్టాక్ ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ కెమెరాలు, ప్రైమరీ కెమెరా 12మెగా ఫిక్సల్, ఎల్ఈడీ ఫ్లాష్, ఎఫ్/1.8 అప్రెచర్, 5 మెగా ఫిక్సల్ సెకండరీ కెమెరా, ఎఫ్/2.2 అప్రెచర్, 8 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎఫ్/2.2 అప్రెచర్ , ఫింగర్ ఫ్రింట్ స్కానర్, 4జీ వోల్ట్, మైక్రో యూఎస్బీ టైప్-సి సపోర్ట్, బ్లూ టూత్ 4.2, 3.5 ఎంఎం ఆడియో జాక్, 3000ఎంఎహెచ్ బ్యాటరీ, 15వాట్స్ పవర్ సపోర్ట్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
Authorization