సార్మ్‌ఫోన్ ఉన్న వారందరూ కచ్చితంగా వాట్సాప్‌ను వాడుతూనే ఉంటారు. వినియోగదారుల కోసం పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. అందులో భాగంగానే డార్క్‌మోడ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌కు సంబంధించి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది. ఈ డార్క్‌మోడ్ ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో వచ్చేసింది. డార్క్‌మోడ్ వల్ల కళ్లకు అలసట తగ్గడం, పవర్ తక్కువగా వినియోగమవడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే యూజర్లు చాలా కాలంగా దీని కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో వాట్సప్ కూడా కొంతకాలంగా డార్క్మోడ్పై కసరత్తు జరుపుతోంది. త్వరలో ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సప్‌కు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందించే WABetaInfo డార్క్మోడ్కు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం డార్క్‌మోడ్‌ను వాట్సప్ బీటా టెస్టర్స్ పరీక్షిస్తున్నారు. అది కూడా సెట్టింగ్స్ పేజీలో మాత్రమే వాట్సప్ డార్క్ మోడ్ కనిపించింది. నోటిఫికేషన్ సెట్టింగ్స్, డేటా, స్టోరేజ్ సెట్టింగ్స్, ఛాట్స్ సెట్టింగ్స్, అకౌంట్ సెట్టింగ్స్‌లో డార్క్ మోడ్ అని మాత్రమే ఉంది. ఒకవేళ మీకు బీటా యాప్ ఉన్నా, 2.19.82 వర్షన్ అప్డేట్ చేసినా డార్క్‌మోడ్ ఫీచర్ కనిపించదు. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
Authorization