ఫేస్బుక్.. స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారందరికీ ఇందులో అకౌంట్ కచ్చితంగా ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులు, పరిచయస్తులతో తరచూ సమాచారాలు పంచుకోవచ్చు. సాంకేతికత పెరిగేకొద్ది మోసాలు, దారుణాలు పెరుగుతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళకు ఫేస్బుక్ అడ్డాగా మారిపోయింది. అలాంటి కొందరి వల్ల మన అకౌంట్ హాకింగ్‌కు గురైతే.. తెలిసిన వారో.. లేక ఇంకేదైనా ఉద్దేశంతో చేసేవారో.. కారణమేదైనా మన అకౌంట్ హ్యాకింగ్ బారిన పడితే దానిని వారు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. మనమే నష్టపోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో యూజర్ల ప్రైవసీకి ముప్పు ఉంది. అందువల్ల మన అకౌంట్‌ను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఫేస్బుక్ అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మీ అకౌంట్ హ్యాక్ కాకుండా జాగ్రత్త పడొచ్చు. మరి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా...
ముందుగా ఫేస్బుక్ ఓపెన్ చేయండి. కుడివైపు ఉన్న త్రీ డాట్స్‌ను క్లిక్ చేయండి. అందులో వచ్చే సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో చాలానే ఆప్షన్లు ఉంటాయి. అందులో సెక్యూరిటీ అండ్ లాగిన్ క్లిక్ చేయండి. అందులో సెట్టింగ్ అప్ ఎక్స్ట్రా సెక్యూరిటీ సెక్షన్లో గెట్ అలర్ట్స్ అబౌట్ అన్ రికగ్నైజ్డ్ లాగిన్స్ ఆప్షన్ వస్తుంది. పక్కన ఎడిట్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్, మెసేంజర్, ఈ-మెయిల్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రతీ దానికి గెట్ నోటిఫికేషన్స్, డోంట్ గెట్ నోటిఫికేషన్స్ అని ఆప్షన్స్ ఉంటాయి. ఎవరు లాగిన్ అయినా అలెర్ట్ పొందాలనుకుంటే అందులో గెట్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్‌ను టిక్ చేస్తే సరి. మీరు వేరే సిస్టమ్‌లో, మొబైల్లో లాగిన్ అయినా మెసేజ్ వస్తుంది. ఇతరులెవరైనా మీ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసినా వెంటనే మెసేజ్ వస్తుంది.
Authorization