ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి హైరేంజ్ బడ్జెట్లో పలు రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువగా ప్రొ ఫోన్లు వచ్చాయి. దాదాపు అన్ని రకాల కంపెనీలకు చెందిన ఫోన్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.వాటిల్లో ముఖ్యంగా గెలాక్సీ ఎ సిరీస్, గెలాక్సీ ఎం సిరీస్, రియల్ మీ 3 ప్రొ, మిడ్-రేంజ్ బడ్జెట్లో వివో వి 15 ప్రొ, ఓప్పొ ఎఫ్ 11 ప్రొ తో పాటు మరికొన్ని పోటీ పడుతున్నాయి.
శామ్సంగ్ గెలాక్సీ A90
శామ్సంగ్ దాని గెలాక్సీ సిరీస్ తో బిజీగా ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఇండియాలో నాలుగు మొబైల్స్‌ను ప్రారంభించింది అవి గెలాక్సీ A10, A30, A50, A20. శామ్సంగ్ ఇప్పటికే గెలాక్సీ ఐదవ మొబైల్ ఏప్రిల్10న విడుదలైంది. A90 అనేది ఇండియాలో గెలాక్సీ ఎ లైనప్ నుండి అత్యంత ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా చెప్పవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ A90 ఇన్ఫైనిటీ స్క్రీన్ కలిగిన హ్యాండ్ ఫార్మటుగా రూపొందించబడింది.
రియల్ మి3 ప్రొ
రియల్ మి3 విడుదల చేసినపుడే ఏప్రిల్ మూడవ వారంలో రియల్ మి3 ప్రొ వేరియంట్ విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఓ నివేదిక ప్రకారం రియల్ మి3 ప్రొ ఆక్టా- కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 SoC, సోనీIMX519 కెమెరా సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో VOOC 3.0 వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని అంటే 30 నిమిషాలలో 0 శాతం నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 4GB / 32GB స్టోరేజి, , 4GB / 64GB kþ¼¹s›, 6GB / 64GB స్టోరేజి అను మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండబోతోంది.దీని ధర గురించి ఎలాంటి సమాచారం లేదు.
నోకియా 9 ప్యూర్ వ్యూ
గతేడాది విడుదల చేసిన స్నాప్ డ్రాగన్ కెమెరా కంటే నోకియా 9 ప్యూర్ వ్యూ ప్రయోగంతో అతి పెద్ద హైలెట్ కెమెరా యూనిట్‌ని ప్రస్తుతం విడుదల చేసింది. గతేడాది వచ్చిన నోకియా 9 ఫొటో కాప్చర్కు వెనుక ఉన్న ఐదు కెమెరాలలో రెండు మాత్రమే రంగులను కాప్చర్ చేస్తాయి , మిగిలిన మూడు మోనోక్రోమ్కు సంబంధించినవి. ఐదు కెమెరాలలో ప్రతి ఒక్కటీ 12 మెగాపిక్సెల్ సెన్సార్, ఒక f / 1.8 లెన్స్ కలిగి ఉన్నాయి. నోకియా 9 PureView లో 5.99-అంగుళాల 2K pOLED డిస్ప్లే ప్యానెల్, స్క్రీన్‌పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.SoC 6GB RAM, 128GB స్టోరేజితో అందుబాటులో ఉంటుంది. ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాఉలు చేస్తోంది.
హువారు P30 ప్రొ
స్మార్ట్ ఫోన్లలో మరొక ఫోన్ హువారు p30 ప్రొ. ఇది డ్యూయల్-సిమ్ EMUI తో ఉంటుంది. వాటర్ డ్రాప్-షేప్ స్క్రీన్‌తో 6.47 పూర్తి హెచ్డీ+ (1080x2340 పిక్సల్స్) -inc స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. దీనిలోLG G8 ThinQస్మార్ట్ ఫోన్ వంటి మాగ్లేవ్ స్పీకరను ఉపయోగిస్తుంది. హువారు p30 ప్రో ఆక్టా-కోర్ హై సిలికాన్ కిరిణ్980980 SoCÔÃ 8GB RAM కలిగి ఉంది. 40-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని 1 / 1.7-అంగుళాల హువావీ సూపర్ స్పెక్ట్రం సెన్సార్, ట / 1.6 (27ఎఎ) లెన్స్‌తో 20-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-కోన్ సెకండరీ కెమెరాతో ఉంది. వీటితో పాటు అనేక రకాల కొత్త ఫీచర్లతో ఈ ఫోన్ ఏప్రిల్ 9 నుంచే అమెజాన్ ద్వారా ఇండియన్ మార్క్కెట్లోకి విడుదలైంది.
Authorization