కృత్రిమ మేధస్సు.. మనిషి ఇప్పటివరకు కనిపెట్టిన వాటిలో గొప్ప శక్తి. మానవునికి ఉన్న అతి గొప్ప శక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. ఇందుకు ముఖ్యమైనది మెదడు. మానవ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిదని విశ్లేషించవచ్చు. అందుకే మన ఆలోచనలకు, ఊహాశక్తికి క్రియేటివిటీకి హద్దులు ఉండవు. అదే మెదడు ఒక యంత్రానికి ఉంటే ఏం జరుగుతుంది. మనం ఎలా అయితే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామో, యంత్రం కూడా సొంతంగా ఆలోచించి చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అంటారు.
ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్‌లో ఒక భాగం మాత్రమే.. ఇది తెలివైన యంత్రాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ యంత్రం మనుషుల్లానే పనులు చేయడంతో పాటు స్పందిస్తుంది. ఇది టెక్నాలజీ ఇండిస్టీకి ఇది ఒక ముఖ్యమైన భాగం. దీని గురించి పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మొదటిసారిగా 1956లో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఉండేవి లెర్నింగ్ అండ్ అప్లైయింగ్ (నేర్చుకోవడం, అనుసరించడం), అంటే చుట్టూ ఉన్న వాటి నుంచి నేర్చుకుని, విశ్లేషించి పరిస్థితులకు అనుగుణంగా పని చేయడం. ఇప్పటికే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మనుగడలో భాగమైపోయింది. మనం వాడే మొబైల్ ఫోన్లలో మాట్లాడే మాటలను రిసీవ్ చేసుకుని వాటికి స్పందిస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని తిగిరి అందివ్వడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో ముఖ్యంగా ఏదైనా నేర్చుకునే సామర్థ్యం, ప్రయోగం చేయడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడే దానిని గుర్తించడం వంటివి చేస్తుంది. కంప్యూటర్లను మనుషులుగా ఆలోచించేలా తీర్చిదిద్దుతుంది. కంప్యూటర్లు తమ తెలివితేటలు వాడి పనులు చేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది.
సాఫ్ట్వేర్ టెక్నాలజీలలో...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ను తనకు తాను కంట్రోల్ చేసుకునే విధంగా, అభివృద్ధి చేసుకునేలా మారుస్తుంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీలు ఏవైనా సరే మనిషితో సరిసమానంగా ఆలోచించి పని చేయగలిగే స్థాయికి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తీసుకువెళుతుంది. ఇది కంప్యూటర్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది. దీని వల్ల కంప్యూటర్ తనంతట తాను నేర్చుకోవడం, వినడం, స్వయంగా తప్పులు సరిదిద్దుకోవడం వంటివి చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. మెషీన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బహిర్గతం చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ ఏజెంట్స్‌ను వెతకడానికి సహాయపడుతుంది. దీని వల్ల యంత్రాలు తెలివిగా పనిచేసేలా తీర్చిదిద్దవచ్చు. దీని ద్వారా తయారైన యంత్రాలు మనుషుల్లానే అర్థాలు తెలుసుకోగలవు. అనుభవం ద్వారా కొన్ని నేర్చుకోగలవు.
ఏఐ రకాలు :
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనేక రకాలుగా ఉంటుంది.
నారో ఏఐ - దీనిని బలహీనంగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పవచ్చు. కేవలం ఒక ప్రత్యేక పని కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఈ విధమైన అప్లికేషన్‌కు ఉదాహరణలు.. యాపిల్ ఫోన్ 'సిరి', మైక్రోసాఫ్ట్‌లో 'కోర్టానా', అమెజాన్‌కు చెందిన 'అలెక్సా' వంటివి. ఇవి కేవలం వాటికి అర్థమైన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వగలవు.
జనరల్ ఏఐ - దీనినిఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా దృఢమైన ఏఐగా పేర్కొనవచ్చు. మానవ మేధస్సుతో సమస్యకు పరిష్కారాలు కనిపెట్టవచ్చు. దీని వల్ల కంప్యూటర్ తనంతట తాను మెరుగు పడుతుంది. చివరికి అత్యంత తెలివైనదిగా మారి మానవాతీత యంత్రంగా రూపాంతరం చెందే పరిస్థితులు ఏర్పడతాయి. మానవ తెలివి తేటలను దాటేలా ఈ తరహా యంత్రాలు తయారవుతాయి.
ఆల్గరిధమ్ - కంప్యూటర్లు తమకు తెలిసిన ఆల్గరిథమ్‌ను బహిర్గతం చేస్తాయి. ఆల్గరిథమ్‌తో మనం ఏం చేయాలో కచ్చితంగా దానికి చెప్పవచ్చు. డేటా ప్రొసెసింగ్, కాల్కులేషన్స్, ఆటోమేటెడ్ రీజనింగ్ వంటి వాటి కోసం వాడవచ్చు.. ఇంకా కొన్ని ఆల్గరిథమ్స్ అయితే కంప్యూటర్లు వాటంతట అవే ఎలా నేర్చుకోవాలో చెప్తాయి. దీనిని మనం మెషీన్ లెర్నింగ్ అని అంటార. మెషీన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్ తనంతటా తాను నేర్చుకునేందుకు సహాయపడుతుంది. ఆల్గరిథమ్ ఉపయోగించి డేటాను వెలికితీస్తుంది.
బీఓటీ (బోట్) - సులువుగా ఉన్న పనులను చేస్తుంది. ఉదాహరణకు రిజర్వేషన్లు, క్యాలెండర్లో ఆపాయింట్‌మెంట్లను గుర్తుచేయడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.
ఏఐ లక్ష్యం: నిపుణతను తయారు చేయడం దీని ప్రధాన లక్ష్యం. వ్యవస్థలోనైతే తెలివి, నేర్చుకునే లక్షణం, నిరూపించడం, వివరించడం, సలహాలు అందివ్వడం వంటివి అందివ్వగలిగేలా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల లక్షణాలైన అర్థం చేసుకోవడం, ఆలోచించడం, నేర్చుకోవడం, ప్రవర్తన వంటివి మానవుని తెలివి తేటలను యంత్రాలలో అమలు చేయడం చేస్తుంది.
ఏఐను మరో రెండు విధాలుగా విభజించవచ్చు. 1. ఏఐ లేని ప్రోగ్రామ్, 2. ఏఐ ప్రోగ్రామ్. మొదటిది కేవలం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే చెబుతుంది. ఇందులో మార్పు నెమ్మదిగా ఉంటుంది. దీని వల్ల ప్రోగ్రామ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్నింటికి సంబంధించి మాత్రమే ఈ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. అవి.. లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పర్సెప్షన్, యూజింగ్ లాంగ్వేజ్. ఇందులో లెర్నింగ్‌కు ఉదాహరణగా చెస్ గురిం చి చెప్పుకోవచ్చు. ఏఐ ప్రోగ్రామ్‌లో సహజమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. దీనిలో మార్పులు చేయడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. ఇందులో అనేక రకాల విభాగాలున్నాయి. అందులో కొన్ని పూర్తి స్థాయిలో మార్పులు చేయలేనివి కూడా ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అమలు చేస్తే ఏర్పడే లాభనష్టాలు :
మనం మీద పడే అనేక ప్రభావాలు పడతాయి.
1. ఆటోమేటెడ్ ట్రాన్స్‌పోర్టేషన్ (స్వయం రవాణా) :
ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. వాహనానికి డ్రైవర్లు అవసరం కానీ డ్రైవర్లు లేకుండా నడిచే వాహనాలను ఉపయోగించుకోవాలని 2012లో గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌ను ప్రారంభించి పరీక్షించింది. అమెరికాకు చెందిన ట్రాన్స్పోర్ట్ ఈ రకమైన కార్లను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
2. సైబర్ టెక్నాలజీ :
ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించి రోబోటిక్ లింబ్స్ ఏర్పాటు చేసిన వ్యక్తుల మెదడుతో అనుసంధానం చేస్తారు. దీని వల్ల వారికి అవయవాలు తొలగించారన్న భావన ఉండదు. అందువల్ల వారు సాధారణ వ్యక్తుల లానే ఉండగలరు. అందుకే వారు ఎలాంటి సమస్యా లేనట్టు సౌకర్యంగా ఉండగలుగుతారు.
3. టేకింగ్ ఓవర్ డేంజరస్ జాబ్స్ (ప్రమాదకమైన ఉద్యోగాల స్థానంలో భర్తీ) :
ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి మనుషులు ప్రాణాలు పోగోట్టుకోవడం వల్ల ప్రాణ నష్టం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రదేశాలలో రోబోట్లను ఉపయోగించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా కాపాడవచ్చు. కానీ ఇలాంటి చోట్ల వాటంతట అవి పనిచేయడం లేవు. మానవులే వీటికి దిశా నిర్దేశం చేస్తూ ఉండాలి. వాటంతట అవి పని చేయడానికి ప్రస్తుతం వీటిని తయారు చేస్తున్నారు.
4. సాల్వింగ్ క్లైమేట్ చేంజ్ (వాతావరణ పరిస్థితులలో మార్పులు చేయడం):
మనిషికి వాతావరణంలో ఏర్పడే మార్పులు పరిష్కరించడం కష్టతరం. కానీ అందుకు రోబోట్లు ఉపయోగపడతాయి. అందుకు సంబంధించిన డేటానుసేకరించి, ధ్రువీకరించి సమాచారాన్ని కచ్చితంగా చెప్పగలవని పరిశోధకులు తేల్చారు.
5. రోబోట్ యాజ్ ఫ్రెండ్ : టి పరిస్థితులలో సీ-3పీఓ లాంటి స్నేహితుడిని ఎవరు కాదనుకోరు. రోబోట్స్ అంటే కేవలం యంత్రాలుగానే చెప్తే చేసే పరిస్థితి నుంచి భావాలను అర్థం చేసుకోగలిగే వరకు వృద్ధిచెందాయి. దీనిని జపాన్‌కు చెందిన కంపెనీ తయారు చేసింది. మున్ముందు రోబోట్ మనిషికి ఒక స్నేహితుడిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.
6. ఇంప్రూవ్డ్ ఎల్లర్ కేర్ (వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం) :
వృద్ధులను జాగ్రత్తగా కాపాడడం కోసం రోబోట్లను చైనాలో ఉపయోగించారు. వారికి ఏ అవసరం వచ్చినా రోబోట్లు స్పందిస్తాయి. వారికి ఏదైనా అనారోగ్యం, అత్యవసరం సంభవించినా రోబోట్లు స్పందించి కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తాయి. ప్రస్తుతం ఇది ఇంకా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి దశలో ఉంది.
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి రోబోటిక్స్‌పై ప్రయోగాలు చేపడుతున్నారు. ప్రమాదకర పరిస్థితులలో వీటిని ఉపయోగించి ప్రాణనష్టం కలుగకుండా నివారించవచ్చు కానీ కొన్ని సంధర్భాలలో ఉపాధి కోల్పోయే అవకాశం కూడా ఉంది.
Authorization