ఎప్పటికప్పుడు సరికొత్తగా ఫీచర్లతో అప్డేట్ అవుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ ముందుకు వెళ్తున్న వాట్సాప్ ప్రస్తుతం మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అదే బయోమెట్రిక్.. బయోమెట్రిక్ అంటే అందరికీ తెలిసిందే.. ఫింగర్‌ప్రింట్ వెరిఫై అయితేనే ఏదైనా ఓపెన్ అయ్యేది. వాట్సాప్‌లోనూ ఆ ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నారు. వాట్సాప్‌ను ఓపెన్ చేయాలంటే కచ్చితంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ప్రస్తుతానికి ఫింగర్‌ప్రింట్ అథంటికేషన్ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే వినియోగదారులకు ఇది అందుబాటులోకి రానుంది. స్క్రీన్‌షాట్ కుదరదు ఈ బయోమెట్రిక్ ఫీచర్‌తో వాట్సాప్‌ను లాక్, అన్‌లాక్ చేయడానికి ఫింగర్‌ప్రింట్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం సందేశాలను స్క్రీన్ షాట్ తీసుకోలేరు. కొందరు వాట్సాప్ యూజర్లకు ఇది గుడ్ న్యూస్.. మరికొందరు వాట్సాప్ యూజర్లకు ఇది బ్యాడ్ న్యూస్. ఇక వీటితో పాటు డూడుల్ యూఐని కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా స్టికర్స్, ఎమోజీలను స్నేహితులతో పంచుకోవచ్చు.