ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడకం సర్వసాధారణమైంది. అందులో ఏ చిన్న ఎర్రర్ కనిపించినా నిపుణుల వద్దకు పెరిగెడుతుంటాం.. వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా చేసి చూపించి లేనిపోనివి చెబుతుంటారు. దాని వల్ల సమయం, డబ్బు వృథానే.. అలా కాకుండా చిన్న చిన్న విషయాలను తెలుసుకుంటే, కంప్యూటర్ పని తీరును మెరుగుపరుచుకోవచ్చు. సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చు.
- వీలైనంత వరకు కంప్యూటర్ డెస్క్టాప్ను క్లీన్‌గా ఉంచుకోవాలి. యానిమేటెడ్ వాల్ పేపర్లు, స్క్రీన్ పేపర్లు కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.
- హార్డ్‌డ్రైవ్‌లో స్పేస్ ఉండేలా చూసుకోవాలి. అనవసర సాఫ్ట్ వేర్లు ఇన్స్టాల్ చేసి సీ డ్రైవ్, అలానే ఆపరేటింగ్ సిస్టంపై ఎక్కువ ఒత్తడి పడకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు రిమూవ్ లేదా అన్ ఇన్స్టాల్ చేసేయాలి. ఇలా చేస్తే డ్రైవ్‌లో స్పేస్ ఏర్పడుతుంది.
- సిస్టంలో స్టోరేజ్ డేటా కరప్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే పీసీలోని డేటాను ఎప్పటికప్పుడు ఎక్స్టర్నల్ స్టోరేజ్ డ్రైవ్‌లలోకి మార్చుకుంటూ ఉండాలి. లేదంటే ఏదైనా ఐక్లౌడ్ సర్వీసును ఎంపిక చేసుకోండి.
- కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ ఆన్‌లో ఉన్నప్పటికీ కీబోర్డు, మౌస్‌లలో ఎలాంటి స్పందన ఉండదు. సిస్టం స్ట్రక్ అయింది అని కూడా అంటాం. దీనికి కారణం పీసీలో ఎక్కువ అప్లికేషన్లు ఓపెన్ చేసి ఉంచడమే. అవసరమైనంత వరకే ఓపెన్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
- కొన్ని సార్లు వైరస్ల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అందువల్ల పీసీలో యాంటీ వైరస్ ను ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.
- ఇంటర్నెట్ను వినియోగిస్తుంటే సిస్టం వేగం తగ్గుతుంది. అందుకు కారణం కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు ఉండడమే. వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
- డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రీసైకిల్ బిన్‌లోకి చేరతాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు స్టార్ట్ బటన్ నుంచి రన్లోకి రీసెంట్, టెంప్ ఫైళ్లను కూడా డిలీట్ చేసుకోవాలి.
ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే, కంప్యూటర్ బాగుంటుంది. ఎక్కువ సమస్యలు ఇలాంటి చిన్నచిన్న వాటి నుంచే మొదలవుతాయి. చిన్నపాటి జాగ్రత్తలే కంప్యూటర్ను, అందులోని ఫైళ్లని కాపాడతాయి.
Authorization