యాక్ట్ ఫైబర్‌నెట్ వినియోగదారులకు 100 జీబీ డేటా అదనంగా అందిస్తున్నది. ఈ సంస్థ కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో మూడో అతిపెద్ద సబ్‌స్క్రైబర్‌గా ఉంది. ప్రస్తుత కస్టమర్లను కాపాడుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే బోనస్ డేటా ఆఫర్‌ను ఆవిష్కరించింది. ప్రతి నెల 100 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. మే నెల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బోనస్ డేటా ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాలని భావించే కస్టమర్లు యాక్ట్ ఫైబర్‌నెట్ మొబైల్ యాప్ ద్వారా సేవలు పొందొచ్చు. ఈ బోనస్‌ను సంస్థ ఫిబ్రవరిలోనే ప్రారంభించింది. ఇప్పుడు కూడా కొనసాగిస్తోంది. యూజర్లు వారి అకౌంట్లో బోనస్ డేటా చూసుకోవడానికి యాక్ట్ ఫైబర్‌నెట్ మొబైల్ యాప్‌లోని ఫ్లెక్సీ బైట్స్ ప్లస్ సెక్షన్లోకి వెళ్లాలి. ఈ కంపెనీ భవిష్యత్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తుందో చూడాలి. ప్రధానంగా డేటా క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకు రావొచ్చనే అంచనాలున్నాయి.