రోజుకో కొత్త రకం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదల అవుతోంది. కొత్త కొత్త ఫీచర్లు కావాలనుకునే వారు ఎప్పటికప్పుడు ఫోన్లు మారుస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం అయిపోయింది. కొత్త ఫోన్ కొంటే.. మరి పాత ఫోన్ ఏం చేయాలి..? కొందరు వాటిని అలాగే దాచుకుంటారు. కొందరైతే అమ్మేస్తుంటారు. ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ సగం ధరకు అమ్మేయడం కంటే.. ఇంటిలోనే ప్రత్యామ్నాయాలకు ఉపయోగించుకుంటే మంచిది. కాకపోతే అందుకు కొంచెం వినూత్నంగా ఆలోచిస్తే, అనేక రకాల అవసరాలకు ఉపయోగించు కోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
- పాత స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఇన్స్టాల్ చేసి వై-ఫై రూటర్‌లా వాడుకోవచ్చు.
- ఇష్టంగా గేమ్స్ ఆడేపుడు ఫోన్ కాల్స్ వస్తే డిస్ట్రబెన్స్గా అనిపిస్తుంది. పాత ఫోన్లో వివిధ రకాల గేమ్‌లను లోడ్ చేసి గేమింగ్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.
- వైర్లెస్ సెక్యూరిటీ కెమెరాలుగా మార్చే అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి సెక్యూరిటీ వెబ్ క్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు.
- టీవీ అవుట్ స్లాట్‌ను కలిగి ఉన్నట్లయితే టీవీకి కనెక్ట్ చేసుకుని మీడియా ప్లేయర్లా ఉపయోగించుకోవచ్చు.
- ఎక్కడికైనా వెళ్ళేపుడు జీపీఎస్ నేవిగేటర్‌లా ఉపయోగించుకోవచ్చు
- వివిధ అప్లికేషన్లను పరీక్షించుకునే టెస్ట్ డివైస్లానూ వినియోగమవుతుంది.
- డేటా బ్యాకప్ లేదా డేటా స్టోరేజ్ డివైస్లానూ వాడుకోవచ్చు.
Authorization