జియో... 2015లో ఉచిత డేటా పేరున తీసుకువచ్చిన ఆఫర్లు భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చౌక ధరకే డేటా అందించడంతో ఇతర టెలికాం సంస్థల ఆదాయానికి బాగానే గండి పడింది. టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన జియో మెల్లగా ఆన్లైన్ ట్రేడింగ్, స్మార్ట్‌ఫోన్ తయారీలు ఇలా ఒకొక్కటిగా తన హవా పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం అందరినీ షాకిచ్చేలా మరో ప్రకటన చేసింది. జియో సంస్థ త్వరలో ''జియో బ్రౌజర్'' అనే అప్లికేషన్‌ను పలు ప్రాంతీయ భాషల్లో ప్రకటించనుంది. ప్రాంతీయ భాషల్లో బ్రౌజర్‌ను విడుదల చేసే తొలి సంస్థగా జియో నిలిచింది. ప్రస్తుతం ఆన్లైన్ మొబైళ్లకు మాత్రం గూగుల్ ప్లే స్టోర్‌లో జియో బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది. త్వరలో ఐఫోన్లోనూ జియో బ్రౌజర్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గూగుల్ బ్రౌజర్కే సవాల్ చేసేలా ఈ బ్రౌజర్ వుంటుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జియో బ్రౌజర్ అనే ఈ ప్రత్యేక యాప్ ద్వారా సులభంగానూ, వేగంగానూ బ్రౌజింగ్ చేసుకునే వీలుంటుంది. జియో బ్రౌజర్ కనీసం 4.8ఎంబీ మాత్రమే. ఇంకా తమిళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ వంటి ఎనిమిది భాషల్లో జియో బ్రౌజర్‌ను ఉపయోగించుకోవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Authorization