ప్రస్తుత రోజుల్లో చదువంటే, పాఠశాలకు లేదా కళాశాలకు వెళ్ళి రావడమే కాదు.. అంతర్జాలంలో ఉపయోగపడేవి నేర్చుకునేందుకు అనేక అంశాలు ఉన్నాయి. వాటితో పాటు చదువుకు సంబంధించిన అంశాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరమైన సమాచారం అంతర్జాలంలో లభిస్తోంది. అంతేకాదు.. టెక్నికల్‌గా ఏమైనా నేర్చుకునే వారికి కూడా ఈ అంతర్జాలంలో అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉంటున్నాయి. వెబ్‌సైట్స్ వివరాలు తెలిసుండాలే కానీ అనేక రకాలైన టెక్నికల్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టు.. అందులో వచ్చే సందేహాలు కూడా నివృత్తి చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంటోంది. ప్రస్తుత రోజుల్లో ప్రోగ్రామింగ్ కూడా చాలా ముఖ్యమైనదే కాబట్టి, అలాంటి ప్రోగ్రామింగ్ చేయాలనుకునే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటున్నాయి. బీటెక్, ఎంటెక్, గేట్, ఎంసీఏ విద్యార్థులు టెక్నికల్ కోర్సులు నేర్చుకునే వారి కోసం కొన్ని వెబ్‌సైట్స్..
ట్యుటోరియల్స్ పాయింట్.కామ్.. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు నేర్చుకునే వారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కంప్యూటర్‌సైన్స్, వెబ్‌డెవలప్‌మెంట్, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్, జావా టెక్నాలజీస్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, డేటా బేస్ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ, బిగ్ డేటా ఎనాలసిస్ వంటి వాటితో పాటు ట్యుటోరియల్ లైబ్రరీ కూడా ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్లి మెనూ బార్ మీదక్లిక్ చేసుకుని చూసుకుంటూ మనకు అవసరమున్న అంశాన్ని ఎంచుకుని నేర్చుకోవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఆన్లైన్ డెవలప్మెంట్ టెస్టింగ్ టూల్స్, కోడింగ్ గ్రౌండ్ - ఫ్రీ ఆన్లైన్ ఐడీఈ అండ్ టెర్మినల్, కరెంట్ అఫైర్స్, యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్ నోట్స్, టాప్ ఆన్లైన్ ట్యూటర్స్, ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్, ఫ్రీ ఆన్లైన్ వైట్‌బోర్డ్, ఏ ఫ్రీ టూల్ఫర్ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్, షార్ట్ ఆర్టికల్స్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఏదైనా సందేహం వస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌లో నివృత్తి చేసుకోవచ్చు.
గీక్స్ ఫర్ గీక్స్.. ఇందులో ప్రతి రోజు ఆర్టికల్స్ వస్తుంటాయి. డిగ్రీ, బీటెక్ తర్వాత గేట్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటే గేట్ ట్యుటోరియల్ అందుబాటులో ఉంది. అయితే లాగిన్ అయ్యాకే నేర్చుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ మాథమాటిక్స్కు సంబంధించి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో బ్లాగ్‌కు సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. బ్లాగ్‌కు సంబంధించి తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోవచ్చు.
స్టడీ టూ నైట్.. ఇందులో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. కోర్ జావా, సీ++, డీబీఎంఎస్ అండ్ ఎస్‌క్యూఎల్, పైథాన్, సీ లాంగ్వేజ్, హెచ్‌టీఎంఎల్, లైబ్రరీ, ఆపరేటింగ్సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ నెట్వర్క్ వంటి సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఏదైనా సందేహం ఏర్పడితే క్యూ అండ్ ఏ ఫారమ్‌లోకి వెళ్లి మీ సందేహాన్ని వ్యక్తపరచవచ్చు. ఒకవేళ మీకంటే ముందు అదే సందేహాన్ని ఎవరైనా వెలిబుచ్చితే అందుకు సమాధానం కూడా సిద్ధంగా ఉంటుంది.
కంప్యూటర్ హోప్.. ఇందులో కంప్యూటర్‌కు సంబంధించిన సమస్య హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్ ఏదైనా సరే ఇక్కడ సమాధానం దొరుకుతుంది. యూజర్‌నేమ్ హ్యాక్ అయితే ఎలా డిటెక్ట్ చేయాలి, సిస్టమ్ రిస్టోర్, పాస్వర్డ్ ప్రొటెక్ట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు సంబంధించిన కమాండ్స్ ఎలా ఉపయోగించాలి అనేవి ఇందులో వివరంగా ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఏదైనా ఇక్కడ సెర్చ్ చేయవచ్చు.
జావా టీ పాయింట్.. అన్నింటికీ సంబంధించిన ట్యుటోరియల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. కొత్తగా వచ్చే కోర్సులు అందుబాటులో ఉంటుంటాయి. బీటెక్, ఎంసీఏ వారికి అవసరమైన కోర్సులు, పాపులర్‌గా ఉన్న ట్యుటోరియల్స్, డేటాబేస్ ట్యుటోరియల్స్, వెబ్ టెక్నాలజీ, జావా టెక్నాలజీ, నాన్‌టెక్నికల్ టాపిక్స్ అయిన ఇంటర్వ్యూ, ప్రాజెక్టు వర్క్స్, ఫోర్మ్, క్విజ్ వంటివి కూడా నేర్చుకునే వెసులుబాటు ఉంది.
స్టాక్ ఓవర్ ఫ్లో.. డెవలపర్స్‌కి ఇది చాలా ఉపయోగకరమైన వెబ్సైట్. వెబ్సైట్ డిజైన్ చేసేవారైనా, ప్రోగ్రామ్స్ ఉపయోగించి అప్లికేషన్స్ తయారు చేసే వారికైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చేసే పనిలో ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే సమాధానం తెలుసుకోవచ్చు. ఇందులో సైన్అప్ చేసుకుని లాగిన్ అయితే పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మీరు అడగాలనుకున్న ప్రశ్న వేరెవరో అడిగి ఉంటే అందులో సులువుగానే సమాధానం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
డబ్ల్యూ3 స్కూల్స్.. ఇందులో చాలా రకాల ట్యుటోరియల్స్ అందుబాటులో ఉంటాయి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్, పైథాన్, పీహెచ్‌పీ, జెక్యూరీ, జావా, డబ్ల్యూ3.సీఎస్ఎస్, కలర్ పికర్, బూస్ట్‌స్ట్రాప్ వంటివి ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉంటాయి. వాటితో పోల్చుకుంటూ నేర్చుకోవచ్చు. అలా చేయడం వల్ల సందేహాలు లేకుండా సులువుగా నేర్చుకోవచ్చు. వీటితో పాటు కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి.
Authorization