దేశీయ టెలికాం రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న ఎయిర్టెల్ తన కస్టమర్లకు శుభవార్తను తీసుకువచ్చింది. ఇన నుంచి ఎయిర్టెల్ టీవీ వెబ్ వెర్షన్లోనూ అందుబాటులో ఉంచుతున్నట్టు వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్టెల్ టీవీ సేవలు ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్లోనూ లభించనున్నాయి. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లు, వెబ్బ్రౌజర్లలో ఎయిర్టెల్ టీవీ సేవలు పొందవచ్చు. పరిమిత సంఖ్యలోనే... ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే ఎయిర్టెల్ టీవీ వెబ్‌వెర్షన్‌లో వీడియోలు, ఇతర లైవ్ టీవీ సేవలను అందుబాటులో ఉంచారు. త్వరలో పూర్తి స్థాయిలో అన్ని సబ్స్క్రిప్షన్ సర్వీసులు, లైవ్ టీవీ సేవలను అందివ్వనున్నారు. సేవలు పొందేందుకు.. ఎయిర్టెల్ టీవీ వెబ్ సేవలను పొందడానికి వినియోగదారులు మొదటగా https://www.airtelxstream.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వారి ఎయిర్టెల్ నంబర్‌ను నమోదు చేయాలి. వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దీంతో సభ్యత్వ పక్రియ పూర్తయినట్లే. ఇక నిశ్చితంగా ఎయిర్టెల్ టీవీ సేవలను పొందవచ్చు.