సాంకేతికతలో మార్పులు చోటుచేసుకుంటున్న కొద్ది స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిపోతోంది. అత్యధిక శాతం జనాభా స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. కీ పాడ్ ఆపరేటింగ్‌తో పోలిస్తే టచ్‌స్క్రీన్ వాడకం సులభంగానూ ఉంటోంది. దీంతో స్మార్ట్ఫోన్ల నుంచి టాబ్లెట్ పీసీల వరకు అన్నింటిలోనూ టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్గా ఉంటోంది. అయితే మొబైల్లో లోడ్ పెరిగేకొద్ది టచ్‌లు పనిచేయకుండా మొరాయిస్తుంటాయి. ఇచ్చిన కమాండ్ వెంటనే తీసుకోక సతాయిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో చేజారి కింద పడినపుడు స్క్రీన్ పగలకున్నా కూడా టచ్ పని చేయదు. వెంటనే రిపేర్సెంటర్కు పరిగెత్తుంతుంటారు. అలా కాకుండా పని చేయని టచ్‌ను సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు ముందుగా కొన్ని చిట్కాలు ప్రయోగించి పని చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికీ పనిచేయకపోతే అపుడు రిపేర్ సెంటర్‌కు వెళ్ళవచ్చు.
పాటించాల్సిన చిట్కాలు..
- చిన్న బ్రష్ సాయంతో ఫోన్ కాంటాక్ట్‌ను క్లీన్ చేయాలి.
- ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేయాలి. కొన్ని క్షణాల తర్వాత ఆన్ చేయాలి. ఇలా చేస్తే సాఫ్ట్వేర్ సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి.
- ఫోన్లో ఉన్న బ్యాటరీని తీసి వేసి కొంచెం సేపటి తర్వాత మళ్లీ బ్యాటరీ వేసి ఆన్ చేయాలి. లేదంటే ఫోన్ బ్యాటరీ తీసివేసినపుడే సిమ్ కార్డ్, మెమోరీ కార్డులను తీసి మళ్ళీ యథా స్థానాల్లో వేయాలి. కొన్ని సందర్భాలలో మెమోరీ కార్డ్, సిమ్‌కార్డ్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఆ సమస్య తొలగిపోయి ఫోన్ పనిచేస్తుంది.
- టచ్ పేనిచేయకపోతే ఫోన్ డాక్యుమెంటేషన్‌ను ఒకసారి పరిశీలించండి. అందులోని సూచనలు పాటిస్తే సమస్య పరిష్కారం కావొచ్చు.
- సాఫ్ట్‌వేర్‌లో కొత్త కొత్త వర్షెన్లు వస్తుంటాయి. అందుకు సంబంధించి అప్పుడప్పుడు నోటిఫికేషన్లు కూడా వస్తుంటాయి. అలాంటి సమయంలో అవసరాన్ని బట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే టచ్ మీద ప్రభావం తగ్గొచ్చు.
- అయినప్పటికీ టచ్ పనిచేయకుంటే రీసెట్ చేయాలి. అలా చేయడం వల్ల అంతకుముందున్న డేటా మొత్తం పోచయే అవకాశాలు ఉన్నాయి. అయినా పర్వాలేదు అనుకుంటే ఇలా చేసి చూడొచ్చు. దీని వల్ల ఫోన్ పూర్తిగా రీఫ్రెష్ అవుతుంది. కొత్త ఫోన్ ఎలా ఫాస్ట్‌గా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది.
అయినా సమస్య పరిష్కారం కాకుండే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను లేదా సర్వీస్ సెంటర్లో సంప్రదిస్తే ఏం చేయాలో సలహా ఇస్తారు. ఇలా ఫోన్ టచ్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. ఫోన్లో డేటా ఎప్పటికప్పుడు ఎరేజ్ చేయడమో, ట్రాన్సఫర్ చేయడమో చేస్తుండాలి. అలా చేస్తే ఫోన్‌పై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
Authorization