ఆడియో బ్రాండ్ సౌండ్ వన్ తాజాగా అదిరిపోయే డిజైన్‌తో హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ అవకాశం ఉన్న సూపర్ హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి పేరు ఎక్స్80. మ్యాగటిక్ నెక్‌బాండ్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ప్రయాణాలలో, రోజువారీ అవసరాల కోసం వీటిని ఉపయోగించవచ్చు. ఇందులో హెచ్డీ వాయిస్, మ్యూజిక్ ప్లే బ్యాక్ టైమ్ వంటి ఫీచర్లున్నాయి. ఈ హెడ్‌ఫోన్స్‌లో బ్లూటూత్ వెర్షన్ 4.2, 110 ఎంఏహెచ్ బ్యాటరీ, 10.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఇయర్‌ఫోన్స్ ఏ2డీపీ, హెచ్ఎఫ్పీ, హెచ్ఎస్పీ వంటి ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. 50 శాతం వ్యాల్యూమ్‌తో దాదాపు 10 గంటల పాటు పాటలు వినొచ్చు. దీనికి హైబ్రిడ్ సిలికాన్ రబ్బర్ ఇయర్‌బడ్స్ ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డును పెట్టుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు ఫోన్‌కు 33 అడుగుల దూరం వరకు బ్లూటూత్ పనిచేస్తుంది. హెడ్‌ఫోన్ ధర రూ.2,990. లాంచ్ ఆఫర్లో భాగంగా వీటిని రూ.1,890కే సొంతం చేసుకోవచ్చు. ఇది పరిమితకాల ఆఫర్. ఈ హెడ్‌ఫోన్స్‌కు ఏడాది వారంటీ ఉంది.